close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

కొలువుల కబురు

* గిరిజన, బీసీ శాఖల్లో 310 ఉద్యోగాలు
* భర్తీకి ప్రకటన జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ

ఈనాడు, హైదరాబాద్‌: గిరిజన, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని వసతిగృహాల్లో 310 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. గిరిజన శాఖలో 4 వసతిగృహ సంక్షేమాధికారి గ్రేడ్‌-1 ఖాళీలు, 87 గ్రేడ్‌-2 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీసీ సంక్షేమ శాఖలో 219 వసతిగృహ సంక్షేమ అధికారి గ్రేడ్‌-2 ఉద్యోగాల భర్తీకి కూడా ఉద్యోగ ప్రకటన జారీ చేశారు. దరఖాస్తులు, మరిన్ని వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు స్వీకరిస్తారు.
https://tspsc.gov.in/


Posted on 31-01-2018