close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

7 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ గురుకులాల్లో ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ టీచర్ల పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 612 పోస్టులకు, 1:2 నిష్పత్తిలో 963 మంది అభ్యర్థులను పరిశీలనకు పిలిచామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ మాసబ్‌ ట్యాంక్‌ సాంకేతిక విద్యాభవన్‌లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది.
ఎంపిక జాబితా
వెబ్‌సైట్‌




Posted on 02-02-2018