close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

తొలిసారి ఆన్‌లైన్‌లో టీఆర్‌టీ పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ)ను తొలిసారిగా ఆన్‌లైన్లో నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. పోస్టులు, మాధ్యమాలు, సబ్జెక్టుల వారీగా కలిపితే దాదాపు 48 కేటగిరీల్లో.. అత్యధికంగా 43 కేటగిరీల పోస్టులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూలు జారీ చేసింది. స్కూల్‌ అసిస్టెంట్‌ (బయాలజికల్‌ సైన్స్‌, మేథమెటిక్స్‌, సోషల్‌ స్టడీస్‌), ఎస్జీటీ తెలుగు, ఆంగ్ల మాధ్యమం పోస్టులకు ఓఎంఆర్‌ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తోంది. ఆన్‌లైన్లో పరీక్షలు నిర్వహించడం ద్వారా వేగంగా ఫలితాలు ప్రకటించేందుకు వీలుండటంతో పాటు నియామకాలు వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తిచేయాలని కమిషన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో కేటగిరీలో కనీసం 20వేలకు మించి దరఖాస్తులు వచ్చిన కేటగిరీలకు ఓఎంఆర్‌ పద్ధతి అవలంబించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఓఎంఆర్‌ విధానంలో నిర్వహిస్తున్న ఎస్జీటీ తెలుగు మాధ్యమానికి 57,464 మంది, ఎస్జీటీ ఆంగ్ల మాధ్యమంలో 29,334 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. టీఆర్‌టీ కింద భర్తీ చేయనున్న 8,792 పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 2,77,574 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ మినహా.. ఎస్జీటీ, పీఈటీ, ఎస్‌ఏ(పీఈ), భాషా పండితుల పోస్టులకు కేటగిరీల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.




Posted on 04-02-2018