close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ఫిబ్రవ‌రి 11లోగా వెబ్‌ఆప్షన్లు ఇవ్వాలి

ఈనాడు, హైదరాబాద్‌: గురుకులాల్లో చిత్రలేఖనం, సంగీతం, క్రాఫ్ట్‌ ఉపాధ్యాయుల పోస్టులకుగాను ధ్రువీకరణపత్రాల పరిశీలనకు హాజరైన అభ్యర్థులు ఫిబ్రవ‌రి 11వతేదీ లోపు సొసైటీలు, జోనల్‌ ప్రాధాన్య క్రమ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. గడువులోగా ఆప్షన్లు ఇవ్వని అభ్యర్థులను ఎంపిక చేయబోమంది. మరిన్ని వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
సంసిద్ధత తెలియజేయాలి....
గురుకులాల్లో పీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు టీజీటీ పోస్టుల అర్హతను వదిలివేసుకుంటున్నట్లు ఫిబ్రవ‌రి 14లోగా ఆన్‌లైన్లో తెలియజేయాలని టీఎస్‌పీఎస్సీ కోరింది.

వెబ్‌సైట్‌
Posted on 10-02-2018