close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

వైద్యవిద్య సహాయ ఆచార్య పోస్టుల ఫలితాలు విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: వైద్యవిద్య విభాగంలో సహాయ ఆచార్య (అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) పోస్టుల ఫలితాలను టీఎస్‌పీఎసీ ప్రకటించింది. వివిధ సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లోని పోస్టులకు ఫిబ్రవ‌రి 28న‌ ఇంటర్వ్యూలు జరిగాయి. ఆ వెంటనే 6 విభాగాలకు సంబంధించిన ఫలితాలను వెలువరించింది. న్యూరోసర్జరీ విభాగంలో ఇద్దరు; యూరాలజీలో ఇద్దరు; ప్లాస్టిక్‌ సర్జరీలో ఒకరు; ఎండోక్రినాలజీలో ఒకరు చొప్పున ఎంపికయ్యారు. ఫలితాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు కమిషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.
వెబ్‌సైట్‌
అభ్యర్ధుల జాబితా



Posted on 01-03-2018