close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

టీజీటీ పోస్టులకు రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: గురుకులాల్లో పీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు వదులుకున్న తరువాత నిర్వహించిన టీజీటీ గణితం, ఫిజికల సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ పోస్టుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరుకాని అభ్యర్థులకు మార్చి 13న మరోసారి పరిశీలన ఉంటుందని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. టీజీటీ తెలుగు, హింది, ఇంగ్లిష్‌, ఉర్దూ పోస్టులకు అభ్యర్థుల కొరత, న్యాయస్థాన ఆదేశాల నేపథ్యంలో రెండో విడత కింద మరో 407 అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక చేశామని పేర్కొంది.
వెబ్‌సైట్‌
అభ్యర్ధుల జాబితా
నోటిఫికేష‌న్‌



Posted on 01-03-2018