close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

పొరపాట్లను సరిదిద్దుకునేందుకు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యాన అధికారులు, వైద్యశాఖలో పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమవ్యక్తిగత వివరాల్లో పొరపాట్లను సరిదిద్దుకునేందుకు అవకాశమిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఉద్యాన అధికారులు, ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఏ పోస్టులకు ఏప్రిల్‌2 నుంచి 4 వరకు, వైద్యశాఖలో సహాయ లైబ్రేరియన్‌, ఫార్మాసిస్టు గ్రేడ్‌-2 పోస్టులకు ఏప్రిల్‌4 నుంచి 6 వరకు ఎడిట్‌ చేసుకోవాలని సూచించింది.
* ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ బాయిలర్స్‌ పోస్టులకు రెండోవిడత ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఏప్రిల్‌ 2న నిర్వహించనున్నట్లు కమిషన్‌ పేర్కొంది.


Posted on 30-03-2018