close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

తదుపరి మెరిట్‌కు అవకాశమివ్వండి

* టీజీటీ గణితం అభ్యర్థులకు కమిషన్‌ సూచన
ఈనాడు, హైదరాబాద్‌: గురుకులాల్లో టీజీటీ గణితం పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ)తో పాటు ఇతర టీజీటీ పోస్టులకు అర్హతను స్వచ్ఛందంగా వదిలేసుకుంటున్నట్లు హామీ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ విజ్ఞప్తి చేసింది. తద్వారా తదుపరి మెరిట్‌ వారిని ఎంపిక చేసేందుకు వీలుంటుందని తెలిపింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో మార్చి 30 వరకు ఆప్షన్‌ ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించింది.



Posted on 30-03-2018