close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

టీజీటీ సైన్స్‌, సంస్కృతం ఫలితాల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: గురుకులాల్లో టీజీటీ బయాలజికల్‌ సైన్స్‌, సంస్కృతం పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. బయాలజికల్‌సైన్స్‌ పోస్టులకు 351 మంది, సంస్కృతం పోస్టులకు నలుగురు అభ్యర్థులు అర్హత సాధించారని పేర్కొంది. దివ్యాంగ అభ్యర్థుల ఫలితాలను తరువాత ప్రకటిస్తామని తెలిపింది. టీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు తాము ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్‌టీ) పోస్టులను వదలేసుకుంటున్నట్లు స్వచ్ఛందంగా హామీ ఇవ్వాలని, తద్వారా తదుపరి మెరిట్‌ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వీలవుతుందని విజ్ఞప్తి చేసింది.
https://tspsc.gov.in/



Posted on 01-04-2018