close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

మహిళా శిశుసంక్షేమశాఖలో సూపర్‌వైజర్‌ పోస్టులకు 16న రాతపరీక్షి

ఈనాడు, హైదరాబాద్‌: మహిళాశిశు సంక్షేమశాఖలో విస్తరణ అధికారి గ్రేడ్‌-1 (సూపర్‌వైజర్‌) పోస్టులకు ఏప్రిల్ 16న కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో జరిగే ఈ రాతపరీక్షకు హాల్‌టికెట్లు అందుబాటులో పెట్టామని పేర్కొన్నారు. అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి పరీక్ష ప్రవేశపత్రాలు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.
అభ్యంతరాల స్వీకరణకు గడువు పెంపు
గ్రామీణ నీటిసరఫరాశాఖలో ఏఈఈ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్ష ప్రాథమిక కీ పై అభ్యంతరాల నమోదు గడువును టీఎస్‌పీఎస్సీ ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. వెబ్‌సైట్లో ఏర్పాటు చేసిన లింకుద్వారా అభ్యంతరాలు నమోదు చేయాలని కోరింది.



Posted on 13-04-2018