close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ఎఫ్‌బీవో పీఈటీ పరీక్షల షెడ్యూలు విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో అటవీ బీట్‌ అధికారుల (ఎఫ్‌బీవో) పోస్టులకు జులై 2 నుంచి నిర్వహించనున్న పీఈటీ పరీక్షల షెడ్యూలును టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. అభ్యర్థులు ఉదయం 5.15 గంటలకు పరీక్ష కేంద్రానికి హాల్‌టికెట్‌, చెల్లుబాటయ్యే గుర్తింపుకార్డుతో హాజరు కావాలని సూచించింది. కాటన్‌ దుస్తులు, బూట్లు, క్యాప్‌ ధరించాలని, అభ్యర్థులు పాటించాల్సిన నియమాలకు కమిషన్‌ వెబ్‌సైట్‌ సందర్శించాలని వివరించింది. ఎస్టీ పురుష, మహిళా అభ్యర్థులు కనీస ఎత్తులో మినహాయింపు పొందేందుకు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలని సూచించింది.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/indexnew.jsp


Posted on 30-06-2018