close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

అక్టోబ‌రు 7న గ్రూప్‌-4 పరీక్ష

* పేపర్‌-1, పేపర్‌-2గా నిర్వహణ
* 4,80,545 మంది అభ్యర్థుల హాజరు
* నాలుగు కేటగిరీ పోస్టులకు 6 లక్షల దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రూప్‌-4, జీహెచ్‌ఎంసీ బిల్‌కలెక్టర్‌, బెవరేజెస్‌ కార్పొరేషన్‌, ఆర్టీసీ జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు కలిపి ఉమ్మడిగా అక్టోబ‌రు 7న (ఆదివారం) నిర్వహించనున్న గ్రూప్‌-4 రాతపరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు. ఈ పరీక్షను 4.8 లక్షల మంది అభ్యర్థులు రాయనున్నారని, వీరికోసం 1046 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-1 (జనరల్‌ నాలెడ్జి), మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 (సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌) ఉంటుందని వెల్లడించారు. కొందరు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అన్ని పోస్టులకు ఉమ్మడిగా సిలబస్‌ ఉండటంతో ఉమ్మడి పరీక్షకు కమిషన్‌ ఏర్పాట్లు చేసింది.



Posted on 02-10-2018