close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ఏఈఈ పోస్టులకు 269 మంది ఎంపిక

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామీణ నీటిసరఫరా శాఖలో సహాయ కార్యనిర్వాహక ఇంజినీరు (సివిల్‌) పోస్టులకు 269 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈ పోస్టులకు సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 3 వరకు మౌఖిక పరీక్షలు జరిగాయి. టీఎస్‌పీఎస్సీ 277 పోస్టులను పేర్కొనగా, 269 మంది అర్హత సాధించారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు కమిషన్‌ పేర్కొంది.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/

Posted on 09-10-2018