close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ఆర్టీసీ, గ్రూప్‌-4 పోస్టులకు ఒకేపరీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-4, టీఎస్‌ఆర్టీసీలో పోస్టులకు కలిపి ఉమ్మడి పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షను అక్టోబరు 7న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ పోస్టులకు సిలబస్‌, పరీక్ష విధానం ఒకేరకంగా ఉందని కమిషన్‌ తెలిపింది. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు వివరించింది.


Posted on 30-06-2018