close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

21న ట్యూటర్‌ పోస్టుల ఇంటర్వ్యూలు

ఈనాడు, హైదరాబాద్‌: వైద్యశాఖలో ట్యూటర్‌ పోస్టులకు డిసెంబ‌రు 21న ఇంటర్వ్యూలు జరుగుతాయని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్‌ వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో జరిగే ఈ మౌఖిక పరీక్షలకు అర్హులైన అభ్యర్థుల వివరాలు వెబ్‌సైట్లో పొందుపరిచామని తెలిపారు. బీసీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ప్రిన్సిపల్‌ పోస్టులకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడించామని వివరించారు. ఏఎస్‌వో రాతపరీక్షల్లో అర్హత మార్కులు పొందిన 52445 మంది అభ్యర్థుల మెరిట్‌ జాబితా వెబ్‌సైట్లో అందుబాటులో ఉందన్నారు.
http://tspsc.gov.in/
Posted on 17-12-2018