close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

టీఎస్‌పీఎస్సీ ద్వారా 17,038 ఉద్యోగాల భర్తీ

* గవర్నర్‌కు నివేదించిన టీఎస్‌పీఎస్సీ
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా ఇప్పటివరకు 17,038 ఉద్యోగాలు భర్తీ చేశామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి తెలిపారు. మరో 13,775 ఉద్యోగాలకు సంబంధించి మెరిట్‌ జాబితాలు ప్రకటించామన్నారు. జనవరి 4న ఆయన టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్, సభ్యులు విఠల్, చంద్రావతి, మహ్మద్‌ మతీనుద్దీన్‌ ఖాద్రి, కె.రామ్మోహన్‌రెడ్డి, శైలుతో కలిసి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలిశారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ కార్యకలాపాలపై ప్రగతి నివేదిక సమర్పించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 38,059 ఉద్యోగాలతో కూడిన 101 ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసినట్లు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ కార్యకలాపాలపై గవర్నర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. తక్కువ మంది ఉద్యోగులతోనూ మెరుగైన ప్రతిభ చూపించారని కితాబిచ్చారు. 2019లోనూ ఉద్యోగాలు కల్పించేందుకు మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా గవర్నర్‌ వారికి సూచించారు.
Posted on 05-01-2019