close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

తెలంగాణ‌ టీఆర్‌టీ ఎంపిక జాబితాల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామక పరీక్షలో వివిధ కేటగిరీల్లో 925 పోస్టులకు నిర్వహించిన పరీక్షలో అర్హులైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ ప్రకటించారు. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్, ఎస్జీటీ, పీఈటీ పోస్టులున్నాయి. ఎస్జీటీ ఉర్దూ మీడియం కింద 636 పోస్టులను పేర్కొంటే... 320 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో ఖాళీగా మిగిలాయి. ఇందులో 35 మంది దివ్యాంగుల ఫలితాలను త‌ర్వాత‌ ప్రకటిస్తామని కమిషన్‌ కార్యదర్శి వెల్లడించారు. స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం తెలుగు మీడియంలో 215 పోస్టుల్లో 16 దివ్యాంగ పోస్టుల ఫలితాలు వైద్య నివేదికల త‌ర్వాత‌ వెల్లడిస్తామని చెప్పారు. ఇందులో మరో 8 ఖాళీల ఫలితాలు న్యాయవివాదాల కారణంగా నిలిపివేసినట్లు వివరించారు. వివిధ మీడియం, సబ్జెక్టుల్లో అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో 16 పోస్టులు భర్తీకాలేదన్నారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను కమిషన్‌ వెబ్‌సైట్లో పొందుపరిచామని వివరించారు.
ఫలితాలు వెల్లడించిన పోస్టులు
స్కూల్‌ అసిస్టెంట్‌ (సోషల్‌ - ఆంగ్ల మాధ్యమం) - 04
స్కూల్‌ అసిస్టెంట్‌ (సోషల్‌ - హిందీ మాధ్యమం) - 01
స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ - తెలుగు మాధ్యమం) - 09
పీఈటీ (ఉర్దూ మాధ్యమం) - 04
పీఈటీ (ఇంగ్లిష్‌ మాధ్యమం) - 01
ఎస్జీటీ (ఉర్దూ) - 281
స్కూల్‌ అసిస్టెంట్‌ (గణితం - తెలుగు మాధ్యమం) - 191
వెబ్‌సైట్‌ : https://tspsc.gov.in
Posted on 19-01-2019