close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

వీఆర్వో పోస్టులకు దరఖాస్తు గడువు జులై 8 వరకు

* ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు 9.25 లక్షలు
* 8వ తేదీ వరకు గడువు పొడిగింపు
* వీఆర్వో పోస్టులకు భారీ స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), సహాయ గణాంక అధికారులు (ఏఎస్‌వో), సీసీఎల్‌ఏలో సీనియర్‌స్టెనో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు జులై 8 వరకు టీఎస్‌పీఎస్సీ పొడిగించింది. ఈ పోస్టులకు జులై 2 చివరిరోజు కావడంతో దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపారు. సర్వర్‌పై వత్తిడి పెరగడంతో లావాదేవీలు, దరఖాస్తు ప్రక్రియ విజయవంతం కాలేదు. ప్రతి సెకనుకు సర్వర్‌పై దాదాపు 12వేల హిట్స్‌ వచ్చినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్‌ తెలిపారు. దరఖాస్తులు స్వీకరించడం కష్టమైందని వివరించారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి, ఇంటర్నెట్‌ బ్యాండ్‌విడ్త్‌ పెంచాలని సీజీజీని కమిషన్‌ ఆదేశించి పరిస్థితిని చక్కదిద్దినట్లు పేర్కొన్నారు. అభ్యర్థుల నుంచి స్పందన భారీగా ఉండటంతో గడువు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. గత వారం రోజుల్లోనే దాదాపు 4 లక్షల దరఖాస్తులు వచ్చాయి. జులై 2 ఒక్కరోజులో 82వేల మంది దరఖాస్తు చేసేందుకు ప్రయత్నించారు.
ఇవీ దరఖాస్తులు...
వీఆర్వో - 9.25 లక్షలు
ఏఎస్‌వో - 75వేలు
సీనియర్‌స్టెనో - 500


Posted on 03-07-2018