close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

భాషాపండితుల పోస్టుల మెరిట్‌జాబితా విడుదల


ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) భాషా పండితుల పోస్టుల మెరిట్‌ జాబితాను (ర్యాంకులను) టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ మీడియంలో కనీస అర్హత మార్కులు పొందిన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచింది. కోర్టు సూచన మేరకు పరీక్షకు హాజరై మెరిట్‌ జాబితాలో స్థానం పొందినప్పటికీ.. నియామకాలు తుదితీర్పును అనుసరించి ఉంటాయని స్పష్టం చేసింది.
లాంగ్వేజ్‌ పండిట్స్‌ మెరిట్‌ జాబితాలో అభ్యర్థుల సంఖ్య 
తెలుగు భాష - 16,088 
హిందీ భాష - 5,191 
ఉర్దూ భాష - 254 
మరాఠీ భాష - 9
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/indexnew.jsp

Posted on 17-07-2018