close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

నేడు రెండు ఉద్యోగ ప్రకటనలు!

ఈనాడు, హైదరాబాద్‌: రెండు ఉద్యోగ ప్రకటనలు వెలువరించేందుకు టీఎస్‌పీఎస్సీ సమాయత్తమైంది. జులై 19న‌ జీహెచ్‌ఎంసీ, బేవరేజస్‌ కార్పొరేషన్‌లోని దాదాపు 202 ఉద్యోగాలకు ప్రకటన ఇవ్వనుంది. గ్రూప్‌-4 కేటగిరీలోని ఈ పోస్టులకు వేర్వేరుగా ప్రకటనలిచ్చి.. ఇటీవల ప్రకటించిన గ్రూప్‌-4తో సమానంగా పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. అలాగే మరో వారం రోజుల్లో హెల్త్‌ అసిస్టెంట్‌, శానిటరీ సూపర్‌వైజర్‌తో కలిపి 85 పోస్టులకు మరో ప్రకటన ఇచ్చేందుకు కసరత్తు పూర్తి చేసింది. జీహెచ్‌ఎంసీ, బేవరేజస్‌ కార్పొరేషన్‌లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం రెండేళ్ల క్రితమే అనుమతులు ఇచ్చింది. పరీక్ష విధానం, సర్వీసు నిబంధనలు రూపొందించడంలో ఆలస్యమైంది. టీఎస్‌పీఎస్సీ పలుమార్లు ఆయా శాఖలకు లేఖలు రాసి నెల రోజుల క్రితం సమాచారం తీసుకుంది. వీటిని క్రోడీకరించిన అనంతరంప్రకటనలు ఇవ్వాలని నిర్ణయించింది. వీటిని గ్రూప్‌-4లో విలీనం చేయాలని భావించినా..ఆయా పోస్టుల సర్వీసు నిబంధనలు వేరుగా ఉండటంతో ప్రత్యేక ప్రకటనలు ఇవ్వాలన్న నిర్ణయానికొచ్చింది.
ప్రకటనలు వెలువడనున్న ఉద్యోగాలివే
జీహెచ్‌ఎంసీ - బిల్‌ కలెక్టర్లు - 124
బేవరేజస్‌ కార్పొరేషన్‌...
* సహాయ అకౌంట్స్‌ అధికారులు గ్రేడ్‌-2 - 56
* సహాయ స్టోర్స్‌ అధికారులు గ్రేడ్‌-2 - 13
* డేటా ప్రాసెసింగ్‌ సహాయకులు - 9
వచ్చే వారం వెలువడేవి
* హెల్త్‌ అసిస్టెంట్‌ - 50
* శానిటరీ ఇన్‌స్పెక్టర్స్‌ - 35


Posted on 19-07-2018