close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ఆగస్టులో టీఆర్‌టీ ధ్రువీకరణ పత్రాల పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ)లో భాగంగా..స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధించి ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆగస్టు మొదటివారంలో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ రెండు రోజుల్లో 1:3 నిష్పత్తిలో అర్హుల జాబితాను విడుదల చేయనుంది. టీఆర్‌టీ ధ్రువీకరణ పత్రాల పరిశీలన జిల్లా స్థాయిలోనే నిర్వహించాలని నిర్ణయించిన కమిషన్‌ ఇప్పటికే జిల్లా విద్యాధికారులకు (డీఈవో) శిక్షణ ఇచ్చింది. ఈ మేరకు వారిని నోడల్‌ అధికారులుగా నియమించింది. జిల్లా స్థాయిలో పరిశీలన ఉన్నందున అక్కడి అధికారులు ప్రణాళిక విడుదల చేసి పరిశీలన ప్రక్రియను చేపడుతారని టీఎస్‌పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. అభ్యర్థులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని పరిశీలనకు హాజరుకావాలని సూచించాయి.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/



Posted on 19-07-2018