close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

జీహెచ్‌ఎంసీలో 124 పోస్టులు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో 124 బిల్‌కలెక్టర్‌ పోస్టులు, బేవరేజస్‌ కార్పొరేషన్‌లో 76 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. వివరాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఈ రెండు పోస్టులు గ్రూప్‌-4 కేటగిరీలోకి రావడంతో పాటు సిలబస్‌ కూడా ఒకేరకంగా ఉంది. దీంతో గ్రూప్‌-4తో కలిపి ఈ పోస్టులకు పరీక్ష నిర్వహించనుంది. పరీక్షలో అభ్యర్థులు చూపించిన ప్రతిభ ఆధారంగా ఎంపికలు చేపడుతుంది. జులై 25 నుంచి ఆగస్టు 10వరకు దరఖాస్తు చేసుకోవాలని కమిషన్‌ పేర్కొంది.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/



Posted on 20-07-2018