close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

30, 31 తేదీల్లో ఎఫ్‌ఆర్‌వో ధ్రువీకరణ పత్రాల పరిశీలన

ఈఈనాడు, హైదరాబాద్‌: అటవీ రేంజి అధికారుల పోస్టులకు నిర్వహించిన పీఈటీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు జులై 30, 31 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి తెలుగు యూనివర్సిటీ ఆవరణలో పరిశీలన ఉంటుందని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. జులై 21 నుంచి 28 వరకు అభ్యర్థులు స్థానికత, అన్‌రిజర్వుడు పోస్టులకు ఆప్షన్లు ఇవ్వాలని వెల్లడించింది. వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ సందర్శించాలని పేర్కొంది.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/



Posted on 21-07-2018