close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోండి

* టీఆర్‌టీ అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి సూచన
ఈనాడు - హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్‌టీ)లో ప్రతిభచూపి 1 : 3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు తమ పత్రాలను సిద్ధం చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ సూచించారు. అభ్యర్థులకు ఆగస్టులో పూర్వజిల్లా కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. పత్రాల పరిశీలనను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని సీఎస్‌ ఎస్‌కే జోషి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని వివరించారు. 1:3 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల వివరాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు పంపించినట్లు వెల్లడించారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 5,210 మంది, ఎస్జీటీ పోస్టులకు 13,666 మంది ధ్రువపత్రాల పరిశీలనకు అర్హత సాధించారన్నారు.


Posted on 28-07-2018