close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ఆవిర్భావ కానుక..

* 2,786 ఉద్యోగాలు
* నేడు ప్రకటనలు జారీ చేయనున్న టీఎస్పీఎస్సీ
* 1,521 గ్రూప్4 ఉద్యోగాలు
* 700 వీఆర్వో పోస్టులు
* అర్థగణాంకశాఖలో 474 ఖాళీలు
* దరఖాస్తుకు మూడు వారాల గడువు

ఈనాడు - హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుకగా వివిధ విభాగాల్లోని 2,786 గ్రూప్-4, వీఆర్వో, ఏఎస్వో పోస్టులతో కూడిన ఉద్యోగ ప్రకటనలను టీఎస్పీఎస్సీ జారీ చేయనుంది. జూన్ 2న టీఎస్పీఎస్సీ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ తరువాత అధికారికంగా ఈ నోటిఫికేషన్లను ప్రకటించనుంది. ఇందులో గ్రూప్-4 కింద 1521, ఆర్టీసీలో 72, 700 గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), అర్థగణాంకశాఖలో 474 సహాయ స్టాటిస్టికల్, మండల ప్రణాళిక అధికారులు, సీసీఎల్ఏ, హోంశాఖలో 19 సీనియర్ స్టెనో ఉద్యోగాలున్నాయి. గ్రూప్-4 ప్రకటన జారీ చేసిన తరువాత దరఖాస్తు చివరి రోజు వరకు వచ్చే పోస్టులన్నీ ఈ ప్రకటనలో చేర్చాలని భావిస్తోంది. దరఖాస్తు చేసేందుకు కనీసం మూడు వారాల గడువు ఇవ్వాలని నిర్ణయించింది. వీఆర్వో పోస్టులు గ్రామ సచివాలయానికి గుండెకాయ లాంటివి. గ్రామస్థాయిలో భూముల సమాచారం, దస్త్రాల ఉన్నతీకరణ, సవరణలు, మార్పులు చేర్పులు, అన్ని రకాల వాంగ్మూలాల నమోదు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, భూముల మార్కెట్ ధరల పరిశీలన తదితర గ్రామస్థాయిలోని కీలకమైన పనులు నిర్వహిస్తారు. విద్యార్హతలు, శాఖాపరమైన పరీక్షల ద్వారా పదోన్నతి అర్హతలు పొందవచ్చు. రెవెన్యూ శాఖలో ఉన్నతస్థానాలు పొందవచ్చు. గ్రూప్-4 పోస్టులో చేరిన ఉద్యోగి అర్హతలు, వయసు ఆధారంగా సూపరింటెండెంట్ స్థాయికి చేరుకోవచ్చు.
గ్రూప్-4 పోస్టులు - 1,521
రెవెన్యూశాఖలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, స్టెనో - 524
పంచాయతీరాజ్శాఖలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు - 117
వాణిజ్యపన్నులశాఖలో జూనియర్ అసిస్టెంట్లు - 231
అటవీశాఖలో జూనియర్ అసిస్టెంట్లు - 32
హోంశాఖలో జూనియర్ స్టెనో, అసిస్టెంట్లు, టైపిస్టులు - 436
నీటిపారుదలశాఖలో జూనియర్ అసిస్టెంట్, స్టెనోలు - 101
విపత్తునిర్వహణ, అగ్నిమాపకశాఖలోజూనియర్ అసిస్టెంట్, స్టెనో - 3
వైద్య, ఆరోగ్యశాఖలో - 77
ఆర్టీసీలో
జూనియర్ అసిస్టెంట్ పర్సనల్, ఫైనాన్స్ పోస్టులు- 72
అర్థగణాంకశాఖలో
మండల ప్రణాళిక, సహాయ గణాంక అధికారులు పోస్టులు- 474
రెవెన్యూశాఖ
గ్రామ రెవెన్యూ అధికారులు- 700
జులై 15న రాతపరీక్ష
గిరిజన, బీసీ సంక్షేమ వసతి గృహాల అధికారుల పోస్టులకు జులై 15న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ తెలిపారు.గిరిజన సంక్షేమ శాఖలో 87, బీసీ సంక్షేమశాఖలో 219 పోస్టులున్నాయి.




Posted on 02-06-2018