close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

పీఈటీ ర్యాంకుల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) వ్యాయామ ఉపాధ్యాయుల (పీఈటీ) పోస్టులకు కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థుల మెరిట్‌జాబితా (ర్యాంకులు) ప్రకటించినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు. ఇంగ్లిష్‌, తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, కన్నడ మాధ్యమాల్లోని ఈ పోస్టులకు 14,705 మంది అభ్యర్థులు జాబితాలో స్థానం సంపాదించారని పేర్కొన్నారు. మెరిట్‌జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరుస్తామన్నారు. న్యాయస్థాన తుదితీర్పు మేరకు నియామకాలు ఉంటాయని వెల్లడించారు.

వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/

Posted on 31-07-2018