close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

సీడీపీవో, డీఏఎస్‌ ఫలితాల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: మహిళా శిశు సంక్షేమశాఖలో శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి (సీడీపీవో) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను కమిషన్‌ ప్రకటించింది. మొత్తం 68 పోస్టులకు 67 మంది అర్హత సాధించారని పేర్కొంది. వినికిడిలోపం కలిగిన అర్హులైన మహిళా అభ్యర్థి అందుబాటులో లేకపోవడంతో ఒక పోస్టు ఖాళీగా మిగిలిపోయిందని వివరించింది. వైద్యఆరోగ్యశాఖలో 10 దంతవైద్యుల పోస్టులకు పరీక్ష, మౌఖిక పరీక్షలు నిర్వహించగా 9మంది ఎంపికయ్యారని తెలిపింది. అంధ దివ్యాంగ కేటగిరీలో అభ్యర్థులు లేకపోవడంతో ఆ పోస్టు ఖాళీగా మిగిలినట్లు పేర్కొంది.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/
అభ్య‌ర్థుల జాబితా

Posted on 31-07-2018