close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ప్రభుత్వ సర్వీసు ధ్రువీకరణ దాఖలుకు గడువు పొడిగింపు

ఈనాడు, హైదరాబాద్‌: వైద్యఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్సు, ఫిజియోథెరపిస్టు, రేడియోగ్రాఫర్‌, పారామెడికల్‌ ఆప్తమాలిక్‌ అధికారి, ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2, ఫార్మాసిస్టు గ్రేడ్‌-2, ఏఎన్‌ఎం పోస్టులకు అభ్యర్థులు ప్రభుత్వ సర్వీసు ధ్రువీకరణ పత్రాలను ఆగ‌స్టు 14 వరకు అప్‌లోడ్‌ చేయవచ్చని కమిషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే నిమ్స్‌లో పనిచేస్తున్న జూనియర్‌, సీనియర్‌ నర్సులూ వెయిటేజీ పొందవచ్చని సూచించింది.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/
నోటిఫికేష‌న్‌


Posted on 10-08-2018