close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ఎంపీఎస్‌వో పరీక్ష 3వ తేదీకి మార్పు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రగతి నివేదన సభ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో రద్దీ, రవాణా తదితర సమస్యల నేపథ్యంలో సెప్టెంబరు 2న మండల ప్రణాళిక, గణాంక అధికారి (ఎంపీఎస్‌వో), సహాయ గణాంక అధికారి (ఏఎస్‌వో) పోస్టులకు జరగాల్సిన రాతపరీక్షను వాయిదా వేసినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ పరీక్షను సెప్టెంబరు 3వ తేదీన (సోమవారం) నిర్వహించనున్నట్లు పేర్కొంది.

Posted on 28-08-2018