close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

గ్రూప్‌-1 ప్రకటనకు మార్గం సుగమం!

ఈనాడు, హైదరాబాద్‌: నూతన జోనల్‌ వ్యవస్థపై కేంద్రం గెజిట్‌ జారీ చేయడంతో పెండింగ్‌లోని గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు మార్గం సుగమమైంది. తదుపరి సాంకేతిక ప్రక్రియ పూర్తయితే దాదాపు 135 పోస్టులతో ప్రకటన జారీ అయ్యే అవకాశముంది. పూర్వ పద్ధతి ప్రకారం గ్రూప్‌-1 పోస్టులు రాష్ట్రస్థాయి పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు వీటిని మల్టీజోనల్‌ కిందకు మార్చాల్సి ఉంది. ప్రభుత్వం జోన్లపై నిబంధనలు జారీ చేసిన తరువాత.. సంబంధిత శాఖలు ఆయా పోస్టులను మల్టీజోనల్‌ కిందకు తీసుకువస్తూ సర్వీసు నిబంధనలు మార్చాల్సి ఉంటుంది.

Posted on 31-08-2018