close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

6న ప్రాథమిక 'కీ' విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ‌లో మండల ప్రణాళిక గణాంక అధికారి, సహాయ గణాంక అధికారి పోస్టులకు నిర్వహించిన రాతపరీక్ష ప్రాథమిక కీ సెప్టెంబ‌రు 6న వెబ్‌సైట్లో పొందుపరచనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సెప్టెంబ‌రు 10 నుంచి 16 వరకు ఆన్‌లైన్లో అభ్యంతరాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. అలాగే వసతి గృహ సంక్షేమాధికారి పోస్టులకు సంబంధించి ఆరో తేదీనే తుది కీ పొందుపరుస్తామని వివరించారు.
వెబ్‌సైట్లో మార్కుల వివరాలు..
ఉద్యాన అధికారి పోస్టులకు 5వ తేదీన‌ నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల మార్కుల వివరాలు వెబ్‌సైట్లో పెట్టినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
https://tspsc.gov.in/

Posted on 06-09-2018