close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

అటవీ శాఖలో 201 ఉద్యోగాల భర్తీకి అనుమతి

* టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకాలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అటవీశాఖలో 201 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ సోమవారం (జనవరి 16) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిలో అటవీ రేంజ్ అధికారు(ఎఫ్ఆర్ఓ)లు 67, అటవీ సెక్షన్ అధికారు(ఎఫ్ఎస్ఓ)లు 90, టెక్నికల్ అసిస్టెంట్ 12, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 32 ఉన్నాయి. కొత్త ఉద్యోగాల కోసం అటవీశాఖ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు ఈ ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Posted on 18-01-2017