టీఎస్‌పీఎస్సీ > సమాచారం

టీఎస్‌పీఎస్సీ - తెలంగాణ గురుకుల ఉద్యోగ నియామ‌క వివ‌రాలు

నిరుద్యోగ ఉపాధ్యాయ పట్టభద్రులకు గురుకుల విద్యాసంస్థల్లో కొలువుల ప్రకటన సువర్ణావకాశంగా చెప్పవచ్చు. దీన్ని సద్వినియోగం చేసుకోవటానికి గరిష్ఠ కృషి అవసరమవుతుంది. పేద విద్యార్థులు ఎక్కువగా చదివే గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతో భారీస్థాయిలో ఉద్యోగాల భర్తీ జరుగనుంది. మంచి వేతనంతో కూడిన ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి పోటీ తీవ్రస్థాయిలో ఉండడం సహజం. పీజీటీ, టీజీటీ, పీడీ ఉద్యోగాలకు స్క్రీనింగ్‌ పరీక్ష, ప్రధాన పరీక్ష ఉంటాయి. ప్రిలిమినరీ/స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో ప్రతిభ చూపినవారిని 1: 15 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేస్తారు (రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పద్ధతిలో). ప్రధాన పరీక్షలోని మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది.
పోస్టుల వారిగా సిల‌బ‌స్‌
>> Principal
>> Staff Nurse
>> TGT
>> PGT
>> Art Teacher
>> Craft Teacher
>> Music Teacher
>> PET
>> PD
>> Librarian in Schools
>> JL
>> Librarian in colleges
Posted on 27-01-2017