close

టీఎస్‌పీఎస్సీ > ప్రిపరేషన్ పద్ధతి

సేద్య విజ్ఞానం ఉందా?సిద్ధం కండి!

తెలుగు ప్రజల సంస్కృతి, ఆర్థిక వ్యవస్థలకు తరతరాలుగా వ్యవసాయ రంగం కేంద్ర బిందువుగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా 851 వ్యవసాయ విస్తరణ అధికారుల (గ్రేడ్‌-2) నియామక ప్రకటన వెలువడింది. నవంబరులోనే రాత పరీక్ష! ఈ పోస్టుల ద్వారా ఎంతోకాలంగా వేచిచూస్తున్న వ్యవసాయ డిప్లొమా, డిగ్రీ విద్యార్థుల ఉపాధి కల సాకారం కాబోతోంది.

ఈ ఏఈఓ నియామక పరీక్ష రాయాలంటే వ్యవసాయ విద్య లేదా అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా/ బీటెక్‌ (అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌) లేదా వ్యవసాయ పాలిటెక్నిక్‌ (సీడ్‌ టెక్నాలజీ, ప్లాంట్‌ ప్రొటెక్షన్‌, ఆర్గానిక్‌ ఫామింగ్‌) లేదా సీఏబీఎం (కమర్షియల్‌ అగ్రికల్చర్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌)లో డిగ్రీ పొంది ఉండాలి. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వయసు- 18 నుంచి 44 సంవత్సరాల్లోపు ఉండాలి.
ఎంపిక విధానం
1. ఆబ్జెక్టివ్‌ టైప్‌ టెస్ట్‌ (ఆన్‌లైన్‌/ ఓఎంఆర్‌ విధానంలో)
2. ఇంటర్వ్యూ
3. సర్టిఫికెట్ల తనిఖీ
పరీక్ష ఫీజు
* ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రాసెసింగ్‌ ఫీజు (రూ.200) + పరీక్ష ఫీజు (రూ.80)
* బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
* ఫీజును ఎస్‌బీఐ ఈ పేలో మాత్రమే ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
* పరీక్షకేంద్రం- హైదరాబాద్‌ (హెచ్‌ఎండీఏ) పరిధిలో మాత్రమే ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
* ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 13.10.2017
* ముగింపు తేదీ: 31.10.2017
* పరీక్ష ఫీజు ముగింపు తేదీ: 31.10.2017
* హాల్‌టికెట్‌ పంపిణీ: పరీక్షకు 7 రోజుల ముందు
* పరీక్ష తేదీ: 22.11.2017
ఉపయోగపడే ముఖ్యమైన పుస్తకాలు
అగ్రికల్చర్‌ (డిప్లొమా లెవల్‌)
1. Hand book of Agriculture - ICAR publication
2. General Agriculture - M.S. Rathore
3. Objective Agriculture- S.R. Kantwa
4. Plant science at a glance - Mangesh. Y
5. Agriculture Biotechnology - Gautam.V.K
6. Biotechnology - B.D. Singh
అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ (డిప్లొమా లెవల్‌)
1. Principles of Agriculture Engineering (vol 1 & 2) - Ojha & Michael
2. Soil & Water conservation Engineering - Dr. R. Suresh
3. Land & Water management Engineering - V.V.N. Murthy & Madan. K. Jha
ఈ పరీక్షలో పార్ట్‌- ఎ, బిలకి సమానంగా వెయిటేజీ ఇస్తున్నారు. కాబట్టి, రెండూ బాగా చదవాలి. ప్రశ్నపత్రం పూర్తిగా ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటుంది. అదే విధానంలో ప్రశ్నలను సాధన చేస్తే మేలు.
పూర్తి వివరాలకు- tspsc.gov.in ను సందర్శించవచ్చు.
ఈ పద్ధతిలో చదివితే సరి!
పార్ట్‌-ఎ: మొదటగా జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌ను బాగా చదవాలి. వీలైతే రోజూ వార్తాపత్రికలను అరగంటసేపు చదివి, ఇతరులతో చర్చించాలి.
* తెలంగాణ చరిత్ర, నైసర్గిక స్వరూపం, సాయుధ పోరాటం, ఆవిర్భావం గురించి క్షుణ్ణంగా చదవాలి.
* తెలంగాణ భాషపై పట్టు పెంచుకోవాలి. భారతదేశ ఆర్థికవ్యవస్థ, సంస్కృతి, సంప్రదాయం, వారసత్వ సంపద మొదలైన అంశాలను బాగా చదవాలి.
* జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలపై దృష్టిసారించటం అవసరం.
* వీటన్నింటితోపాటు ఇంగ్లిష్‌ భాష, వ్యాకరణాల్లో మెలకువలను తెలుసుకోవాలి.
పార్ట్‌-బి: (వ్యవసాయ డిప్లొమా స్థాయి)
* మొదట వ్యవసాయశాస్త్రంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, వ్యవసాయ వాతావరణ శాస్త్రం, సేద్యవిజ్ఞాన శాస్త్రం, పంటల ప్రాముఖ్యం, మేలైన యాజమాన్య పద్ధతులు మొదలైన అంశాలను క్షుణ్ణంగా చదవాలి.
* నేల విజ్ఞానం, సస్య లేదా వృక్ష ప్రజననం, పంటలపై వచ్చే చీడపీడలు, వాటి నివారణల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
* కూరగాయల సాగు, వాటిని పెంచే విధానం, కూరగాయల నిల్వలో అనుసరించాల్సిన సూత్రాలు, ఉద్యాన పంటల ద్వారా విలువ ఆధారిత పదార్థాల తయారీ మొదలైనవి చదవాలి.
* వ్యవసాయ ఆర్థిక మెలకువలు, పంట రుణాలు, లీడ్‌ బ్యాంక్‌ పథకం, రైతు సహకార సంఘాలు- వాటి ప్రాముఖ్యం, వ్యవసాయ మార్కెటింగ్‌- వివిధ రకాల మార్కెట్లు, విత్తన పరిశ్రమ, వ్యవసాయ విస్తరణ, గ్రామీణాభివృద్ధి క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ (డిప్లొమా )
* సర్వేయింగ్‌- వాటి ముఖ్య సూత్రాలు, చైన్‌ సర్వేయింగ్‌, లెవెలింగ్‌- వాటి రకాలు, జీపీఎస్‌ (గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం)లను చదవాలి.
* హైడ్రోలాజికల్‌ సైకిల్‌, వాటర్‌షెడ్‌- వాటి ప్రాముఖ్యం, ఇరిగేషన్‌- వాటి రకాలు, ప్రాముఖ్యం, డ్రైనేజ్‌, వర్క్‌షాప్‌ టెక్నాలజీల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
* వ్యవసాయ పనిముట్లు, హార్వెస్టర్స్‌, ట్రాక్టర్‌, పవర్‌ టిల్లర్లు, హరిత పందిర్లు- వాటి రకాలపై అవగాహన అవసరం.
Posted on 03-10-2017