close

టీఎస్‌పీఎస్సీ > నోటిఫికేష‌న్‌

టీఎస్‌పీఎస్సీ: రెండు ప్ర‌క‌ట‌న‌లు...200 పోస్టులు

* గ్రూప్ 4 పోస్టుల‌తో క‌లిపి అక్టోబ‌రు 7న పరీక్ష నిర్వ‌హ‌ణ‌
* జులై 25 నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), బేవరేజెస్ కార్పొరేషన్లలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) జులై 19న రెండు వేర్వేరు ప్రకటనలు విడుదల చేసింది. వీటి ద్వారా జీహెచ్ఎంసీలో 124, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌లో 78 ఖాళీలను భర్తీ చేయ‌నున్నారు.
1) జీహెచ్ఎంసీలో బిల్ క‌లెక్టర్లు
ఖాళీలు: 124
అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
2) బేవరేజెస్ కార్పొరేష‌న్‌లో 76 ఖాళీలు
* అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీస‌ర్ గ్రేడ్ 2: 13
అర్హ‌త‌: బీకామ్ ఉత్తీర్ణ‌త‌తోపాటు అకౌంట్స్‌లో ప్రొఫిషియ‌న్సీ ఉండాలి.
* అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీస‌ర్ గ్రేడ్ 2: 55
అర్హ‌త‌: బీకామ్ ఉత్తీర్ణ‌త‌తోపాటు కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌లో ప్రొఫిషియ‌న్సీ ఉండాలి.
* డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2: 08
అర్హ‌త‌: డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తోపాటు కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌లో ప్రొఫిషియ‌న్సీ ఉండాలి.
వ‌య‌సు: 18-44 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: బిల్ క‌లెక్ట‌ర్ పోస్టుల‌ను రాత‌ప‌రీక్ష ద్వారా; మిగిలిన‌వాటికి రాత‌ప‌రీక్ష, ప్రొఫిషియ‌న్సీ టెస్టుల ఆధారంగా ఎంపిక చేయ‌నున్నారు. ప్రొఫిషియ‌న్సీ టెస్టులు కేవ‌లం అర్హ‌త ప‌రీక్ష‌లు మాత్ర‌మే. రాత‌ప‌రీక్ష‌లో వ‌చ్చిన మార్కుల ఆధారంగా నియామ‌కాలు చేప‌డ‌తారు.
ప‌రీక్షా విధానం: పేప‌ర్ 1లో జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, పేప‌ర్ 2లో సెక్ర‌టేరియ‌ల్ ఎబిలిటీస్ నుంచి ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. ఒక్కో పేప‌రు నుంచి 150 ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. మార్కులు 150, స‌మ‌యం రెండున్న‌ర గంట‌లు.
ప‌రీక్ష తేది: 07.10.2018
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.80 చెల్లించాలి. రిజ‌ర్వ్‌డ్ అభ్య‌ర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 25.07.2018
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10.08.2018

GHMC Notification

Beverages Notification

Website

Posted on 21-07-2018