close

టీఎస్‌పీఎస్సీ > నోటిఫికేష‌న్‌

టీఎస్‌పీఎస్సీ: పుర‌పాల‌క శాఖ‌, డెయిరీ స‌మాఖ్య‌ల్లో 93 పోస్టులు

తెలంగాణ పురపాలక శాఖ, డెయిరీ సమాఖ్యలలో 93 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) జులై 27న మూడు ప్రకటనలు విడుదల చేసింది. పురపాలక శాఖలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, హెల్త్‌ అసిస్టెంట్లు; డెయిరీ సమాఖ్యలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఇందులో ఉన్నాయి.
1) తెలంగాణ పుర‌పాల‌క‌శాఖ‌లో 35 శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్లు
అర్హ‌త‌: బ‌యోలాజిక‌ల్ సైన్స్‌లో బ్యాచిల‌ర్స్ డిగ్రీతోపాటు ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన సంస్థ‌ నుంచి శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్ ట్రైనింగ్ స‌ర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 18 - 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: రాతప‌రీక్ష ఆధారంగా.
ప‌రీక్షా విధానం: రెండు పేప‌ర్ల‌లో ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. మొద‌టి పేప‌రులో జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ అండ్ జ‌న‌ర‌ల్ ఎబిలిటీస్‌, రెండో పేప‌రులో డిగ్రీ స్థాయి బ‌యోలాజిక‌ల్ సైన్స్ నుంచి బ‌హుళైచ్ఛిక‌ ప్ర‌శ్న‌లు అడుగుతారు. ఒక్కో పేప‌రులో 150 ప్ర‌శ్న‌ల‌కు 150 మార్కులు కేటాయించారు. ప్ర‌తి పేప‌రుకు రెండున్న‌ర గంట‌ల్లో స‌మాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
రాత ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్, క‌రీంన‌గ‌ర్, ఖమ్మం, వ‌రంగ‌ల్, నిజామాబాద్.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.80. రిజ‌ర్వ్‌డ్ అభ్య‌ర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 31.07.2018
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.08.2018
నోటిఫికేష‌న్
=============================
2) తెలంగాణ పుర‌పాలక‌ శాఖ‌లో 50 హెల్త్‌ అసిస్టెంట్లు
అర్హ‌త‌: బయోలాజిక‌ల్ సైన్స్‌లో ఇంట‌ర్మీడియ‌ట్‌తోపాటు ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి మ‌ల్టీప‌ర్ప‌స్ హెల్త్ అసిస్టెంట్ ట్రైనింగ్ కోర్సు/ శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్ ట్రైనింగ్ స‌ర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 18 - 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: రాతప‌రీక్ష ఆధారంగా.
ప‌రీక్షా విధానం: జ‌న‌ర‌ల్ నాలెడ్జ్, ఇంట‌ర్మీడియ‌ట్ స్థాయి బ‌యోలాజిక‌ల్ సైన్సెస్ నుంచి 75 ప్ర‌శ్న‌ల చొప్పున‌ మొత్తం 150 బ‌హుళైచ్ఛిక‌ ప్ర‌శ్న‌లు ఇస్తారు. 150 మార్కులు. రెండున్న‌ర గంట‌ల్లో స‌మాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
రాతప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్, క‌రీంన‌గ‌ర్, ఖమ్మం, వ‌రంగ‌ల్, నిజామాబాద్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, సంగారెడ్డి, న‌ల్ల‌గొండ‌, ఆదిలాబాద్.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.80. రిజ‌ర్వ్‌డ్ అభ్య‌ర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 03.08.2018
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 22.08.2018
నోటిఫికేష‌న్
=============================
3) తెలంగాణ డెయిరీ స‌మాఖ్య‌లో 08 ఫీల్డ్ అసిస్టెంట్లు
అర్హ‌త‌: బయోలాజిక‌ల్ సైన్స్‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 18 - 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: రాత ప‌రీక్ష ఆధారంగా.
ప‌రీక్షా విధానం: జ‌న‌ర‌ల్ నాలెడ్జ్, ఇంట‌ర్మీడియ‌ట్ స్థాయి బ‌యోలాజిక‌ల్ సైన్సెస్ నుంచి 75 ప్ర‌శ్న‌ల చొప్పున‌ మొత్తం 150 బ‌హుళైచ్ఛిక‌ ప్ర‌శ్న‌లు ఇస్తారు. 150 మార్కులు. రెండున్న‌ర గంట‌ల్లో స‌మాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
రాతప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్, క‌రీంన‌గ‌ర్, ఖమ్మం, వ‌రంగ‌ల్, నిజామాబాద్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, సంగారెడ్డి, న‌ల్ల‌గొండ‌, ఆదిలాబాద్.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.80. రిజ‌ర్వ్‌డ్ అభ్య‌ర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 03.08.2018
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 22.08.2018
నోటిఫికేష‌న్

Website

Posted on 28-08-2018