తాజా స‌మాచారం

టెట్‌ రెండు పేపర్లకు 1618 పరీక్షా కేంద్రాలు
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో మే 22న జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) రెండు పేపర్లకు కలిపి 1618 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. ఉదయం జరిగే పేపర్‌-1ను 443 పరీక్షా కేంద్రాల్లో, మధ్యాహ్నం జరిగే పేపర్‌-2ను 1175 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల సంఖ్యలో మార్పు ఏమీ లేదని టెట్‌ కన్వీనర్‌ జగన్నాథరెడ్డి చెప్పారు. రెండు పేపర్లకు కలిపి దాదాపు 3.73 లక్షల మంది హాజరుకానున్నారు. పట్టణాలు, నగరాలకు దగ్గరున్న మండలాల్లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

Posted on 08-5-2016