తాజా స‌మాచారం

టెట్ సమయసారిణిలో స్వల్ప మార్పు
హైదరాబాద్: తెలంగాణలో మే 22న జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) టైంటేబుల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం నిర్వహించే పేపర్-1 పరీక్షా సమయంలో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగాల్సిన పరీక్షను అరగంట ఆలస్యంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు మార్చినట్లు అధికారులు పేర్కొన్నారు. పేపర్ -2 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు యధాతథంగానే పరీక్ష కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Posted on 19-5-2016