తాజా స‌మాచారం

టెట్‌, డీఎస్సీలు వేర్వేరుగానే నిర్వహణ
* ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌), ఉపాధ్యాయల భర్తీకి నిర్వహించే డీఎస్సీని వేర్వేరుగానే నిర్వహిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. సచివాలయంలో పాఠశాల విద్యాశాఖ అధికారులతో న‌వంబ‌ర్ 30న‌ చర్చించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) మార్గదర్శకాల ప్రకారం విడివిడిగానే జరపాలని ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టెట్‌, డీఎస్సీని కలిపి నిర్వహించి సమస్యలను ఎదుర్కొంటోందని, తాముమాత్రం విడివిడిగానే నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే టెట్‌ ప్రకటన విడుదలైనందున రెండు మూడు రోజుల్లో దరఖాస్తుల ప్రక్రియను మొదలు పెడతామని చెప్పారు. డీఎడ్‌, బీఈడీ రెండో సంవత్సరం చదివేవారికి టెట్‌ రాసేందుకు అనుమతించేదిలేదని ఆయన స్పష్టంచేశారు. పాసైన వారికే టెట్‌ రాసేందుకు అర్హత ఉంటుందని తెలిపారు.