తాజా స‌మాచారం

16 నుంచి తెలంగాణ టెట్‌ దరఖాస్తులు
* ఏపీ అభ్యర్థులకూ అవకాశం
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌టెట్‌)కు మార్చి 16 నుంచి దరఖాస్తులు మొదలుకానున్నాయి. పరీక్షకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచారు. తెలంగాణ రాష్ట్ర విద్యా, పరిశోధన మండలి(ఎస్‌సీఈఆర్‌టీ)లో సహాయ కేంద్రం మార్చి 15న ప్రారంభమైంది. మే 1వ తేదీన జరగనున్న పరీక్షకు దాదాపు 5 లక్షల మంది హాజరుకావొచ్చని అంచనా వేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం అనుమతిస్తుందా?: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టెట్‌కు ఏపీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఉత్తీర్ణులైనా దాన్ని ఏపీ ప్రభుత్వం అనుమతిస్తుందా? లేదా? అన్నది ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు పేర్కొంటున్నారు. సీబీఎస్‌ఈ నిర్వహించే సీటెట్‌లో ఉత్తీర్ణులైతే దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆమోదిస్తుంది. తెలంగాణ, ఏపీ టెట్‌లో ఉత్తీర్ణులైనా తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలు ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర టెట్‌ను ఏపీ ఆమోదిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
http://tstet.cgg.gov.in/