తాజా స‌మాచారం

టెట్‌లో పొరపాట్ల సవరణకు గడువు 30
ఈనాడు - హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పేపర్‌, భాష, సబ్జెక్టు, ఫొటోలకు సంబంధించిన వివరాల్లో పొరపాట్లుంటే సవరించుకునేందుకు చివరి తేదీని ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు టెట్‌ కన్వీనర్‌ జగన్నాథరెడ్డి తెలిపారు. అభ్యర్థులు సరైన ఆధారాలతో టెట్‌ కార్యాలయంలో సంప్రదించాలని, 30వ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సవరణలు చేయరని ఆయన సూచించారు.
        టెట్‌, ఎంసెట్‌ లాంటి ప్రవేశ పరీక్షలకు ప్రభుత్వ బడులు, ఉపాధ్యాయులను ఉపయోగించుకోవాలని పీఆర్‌టీయూ టీఎస్‌ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరింది. పరీక్షలకు వెంటనే తేదీలను ప్రకటించాలని, వాటి నిర్వహణ విధుల్లో పాల్గొనడానికి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి తెలిపారు.

Posted on 30-4-2016