నోటిఫికేషన్

విజ‌యా బ్యాంకులో 330 అసిస్టెంట్ మేనేజ‌ర్లు

బెంగ‌ళూరు ప్ర‌ధాన కేంద్రంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న‌ విజయా బ్యాంకు ప్రొబేష‌న‌రీ అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ప్రొబేష‌న‌రీ అసిస్టెంట్ మేనేజ‌ర్(క్రెడిట్)
మొత్తం ఖాళీల‌ సంఖ్య‌: 330
అర్హ‌త‌: క‌నీసం 60శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీతోపాటు ఎంబీఏ/ పీజీడీబీఎం/ పీజీడీఎం/ పీజీబీఎం/ పీజీడీబీఏ/ పీజీ (కామ‌ర్స్‌/ సైన్స్/ ఎక‌నామిక్స్/ లా) ఉత్తీర్ణ‌త లేదా చార్ట‌ర్డ్ అకౌంటెంట్ లేదా ఐసీడ‌బ్ల్యూఏ లేదా కంపెనీ సెక్ర‌ట‌రీ ఉత్తీర్ణ‌త‌.
గ‌మ‌నిక: ఎంపికైన అభ్య‌ర్థుల‌
వ‌యఃప‌రిమితి: 01.08.2018 నాటికి 21-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: ఆన్‌లైన్ టెస్ట్/ ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ ప‌రీక్షా విధానం: ప‌రీక్ష మొత్తం 150 మార్కుల‌కు ఉంటుంది. దీనిలో ఇంగ్లిష్ లాంగ్వేజీకి 50మార్కులు, బ్యాంకింగ్‌కు సంబంధించిన జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌కు 50 మార్కులు, ఫైనాన్షియ‌ల్ మేనేజ్‌మెంట్‌కు 50 మార్కులు కేటాయించారు. ప‌రీక్ష కాల వ్య‌వ‌ధి 120 నిమిషాలు. రుణాత్మ‌క మార్కులు (1/4) ఉన్నాయి.
ప‌రీక్ష తేది: త‌ర్వాత ప్ర‌క‌టించ‌నున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు, ఇత‌రులు ద‌ర‌ఖాస్తు ఫీజు, ఇంటిమేష‌న్ ఛార్జీల‌తో క‌లిపి రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థులు కేవ‌లం ఇంటిమేష‌న్ ఛార్జీ కింద‌ రూ.100 చెల్లించాలి.
చివ‌రితేది: 27.09.2018.
నోట్‌: ఎంపికైన అభ్య‌ర్థులు బ్యాంకు నిర్వహించే 3నెలల కోర్సు అభ్య‌సించాల్సి ఉంటుంది. ఈ సమ‌యంలో వారికి నెల‌కు స్టైపెండ్ రూ.15,000 చెల్లించ‌నున్నారు. కోర్సు పూర్త‌యిన త‌ర్వాత వారికి ప‌రీక్ష (ఎగ్జిట్ టెస్ట్) నిర్వహిస్తారు. ఈ ప‌రీక్ష‌లో నిర్దిష్ట మార్కులు సాధించిన‌వారికి మాత్ర‌మే ప్రొబేష‌న‌రీ అసిస్టెంట్ మేనేజ‌ర్‌గా ఉద్యోగావ‌కాశం క‌ల్పిస్తారు.

Posted on 12-09-2018