వీఆర్‌వో పోస్టులకు ప్రశ్నలన్నీ ఇంటర్ స్థాయిలోనే ఉంటాయి. వీఆర్ఏ పోస్టులకు ప్రశ్నలన్నీ టెన్త్ స్థాయిలోనే ఉంటాయి. ఈ రెండు పోస్టులకు జనరల్ స్టడీస్ ప్రశ్నల్లో మాత్రం 50 శాతం (30) ప్రశ్నలను గ్రామీణ ప్రాంతాలు, గ్రామీణ ప్రజల జీవన స్థితిగతుల మీద అభ్యర్థికి ఉన్న పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి ఇస్తారు.
1) జనరల్ స్టడీస్ - ఈ విభాగంలో వచ్చే అంశాలు:
ఎ) జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అవార్డులు; నోబెల్ బహుమతులు, జ్ఞానపీఠ్ అవార్డులు, రిపబ్లిక్ డే, సాహిత్య, శాస్త్రీయ, సినిమా తదితర కళాత్మక రంగాల్లో కృషి చేసిన వారికి ఇచ్చే ప్రతిభా పురస్కారాలు, అవార్డులు.
బి) ఇటీవల ప్రాచుర్యం పొందిన గ్రంథాలు, గ్రంథకర్తలు.
సి) శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇటీవల సంభవించిన పరిణామాలు; దేశంలో, ప్రపంచంలో వ్యాపించిన వ్యాధులు, రకాలు, వాటి నివారణకు వచ్చిన మందులు, టీకాలు.
డి) రాజకీయంగా అంతర్జాతీయంగా ఏర్పడిన మార్పులు. అలాగే దేశంలో, రాష్ట్రంలో రాజకీయంగా సంభవించిన పరిణామాలు, మారిన ప్రభుత్వాలు, కొత్త మంత్రిత్వ శాఖలు.
ఇ) ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక సర్వేలు, బ్యాంక్ వడ్డీ రేట్లు, క్రెడిట్ పాలసీలు.
ఎఫ్) దేశ, రాష్ట్ర ఆర్థిక బడ్జెట్లు - వివిధ రంగాల కేటాయింపులు
జి) క్రీడా రంగం - జాతీయ, అంతర్జాతీయ క్రీడలు - ట్రోఫీలు, అవార్డులు, కప్పులు, క్రికెట్, వాలీబాల్, ఆ సంవత్సరంలో జరిగిన ప్రముఖ క్రీడా కార్యక్రమాలు మొదలైనవి.
జనరల్ నాలెడ్జ్ కోసం పుస్తకాలను బట్టీ పడితే సరిపోదు. సామాజిక అవగాహన ముఖ్యం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్. దానికి సరిహద్దు జిల్లాలేమిటి? అని ఆలోచిస్తే తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల జిల్లాలు గుర్తుకొస్తాయి. ఇవన్నీ పుస్తకాల్లో చదివి బట్టీ పట్టి గుర్తుపెట్టుకుందాంలే అనుకోకూడదు. ఇలా ప్రతి టాపిక్‌ను సామాజిక స్పృహతో పరిశీలించాలి. తద్వారా పరీక్ష పేపర్‌లో తెలియని ప్రశ్నలకు కూడా సరైన సమాధానాన్ని గుర్తించవచ్చు.

Back