Pratibha logo
about Tariff Contact
Skip Navigation Links
Pratibha Engineering blog

Ask the Expert

ఎంత చదివినా... ఎన్నిసార్లు విన్నా... ఒక్కోసారి కొన్ని విషయాలకు సంబంధించి ఎంతోకొంత సందేహం మిగిలే ఉంటుంది. అలాంటి సందేహాలను తీర్చడానికి ఆన్ లైన్ లో నిపుణులు సిద్ధంగా ఉన్నారు. మీ సందేహాలను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో పంపవచ్చు.
Ask the Expert లోకి రాగానే ముందుగా మీకు సంబంధించిన విభాగంపై క్లిక్ చేయండి. ఒకవేళ మీరు అనుకుంటున్న విభాగం లేకపోతే జనరల్ కేటగిరీపై క్లిక్ చేయండి

ఇంతకు ముందు యూజర్లు అడిగిన ప్రశ్నలు కనిపిస్తాయి. మీ ప్రశ్నకు దగ్గరగా ఉన్న ప్రశ్నపై క్లిక్ చేస్తే సమాధానం కనిపిస్తుంది. మీరు అనుకుంటున్న ప్రశ్న కనిపించకపోతే పేజీలో పైన ఉన్న Ask the Expert లింక్ పై క్లిక్ చేయండి.
అప్పటికే మీరు లాగిన్ అయ్యి ఉంటే ప్రశ్న పోస్టు చేయాల్సిన బాక్స్ వస్తుంది. లాగిన్ అయ్యి ఉండకపోతే లాగిన్ అడుగుతుంది. లాగిన్ అయిన తర్వాత మీ ప్రశ్నను పోస్టు చేయవచ్చు
.
ప్రశ్నను పోస్టు చేయడానికి భాషను మీరే ఎంచుకోవచ్చు. తెలుగు ఎంచుకున్నప్పుడు pop-up లో కనిపించే విండో ఆధారంగా తెలుగు అక్షరాలు టైప్ చేయవచ్చు. ఒక వేళ ఆ విండో ఆధారంగా తెలుగులో టైప్ చేయడం కష్టంగా ఉంటే ఇంగ్లిష్ అక్షరాలను ఉపయోగించి తెలుగు పదాలు టైప్ చేయవచ్చు
.
మీరు ఇంగ్లిష్ భాషను ఎంచుకుంటే ప్రశ్నను ఇంగ్లిష్ లో టైప్ చేసి పంపవచ్చు. నిపుణులు సమాధానం ఇవ్వగానే అది మీ ఇ-మెయిల్ కు వస్తుంది. అందరికీ ఉపయోగపడే ప్రశ్నలను వెబ్ సైట్ లో పబ్లిష్ చేస్తాం. ప్రశ్నలు వీలైనంత క్లుప్తంగా, సూటిగా ఉండాలి
.