Skip Navigation Links
Pratibha Engineering blog

పేరెంట్స్ కాలమ్

       పేరున్న స్కూల్లోనో, కాలేజీలోనో పిల్లలను చేర్చగానే మన పని అయిపోయిందని చాలామంది తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఎదిగే వయసులో పిల్లలకు తమ ఆసరా ఎంత అవసరమో ఎవరూ గుర్తించడం లేదు.
పాఠశాలలో, కళాశాలలో, ఇంట్లో, బయట... బంధువర్గాలతో... స్నేహితులతో
...
ఇలా విభిన్న సందర్భాల్లో పిల్లలు ఎదుర్కొనే రకరకాల సంఘటనలు వారి మనసులపై ఎలా పనిచేస్తున్నాయి
?
వారి చదువుపై అవి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి?

మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని లేదా అవసరమైనంత ప్రదర్శించి పిల్లల్లో సరైన వ్యక్తిత్వ నిర్మాణానికి ఎలా సహాయపడాలి?
చదువు... చదువు... మార్కులు... మార్కులు.... అంటూ వేధించకుండా వారు చదువుకోవడానికి తల్లిదండ్రులు ఏం చేయాలి
?
పిల్లల చదువులు సక్రమంగా, సరైన దిశలో సాగడానికి ఎలాంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి?

ఆకర్షణలకు, అనర్థకరమైన అలవాట్లకు వారు లోనుకాకుండా ఎలాంటి జాగ్రత్తలు వహించాలి?
క్లుప్తంగా చెప్పాలంటే... పిల్లల చదువులు సక్రమంగా సాగి, వారు ఉన్నతమైన పౌరులుగా రూపుదిద్దుకోవాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి అనేది శీర్షికలోని పలు విభాగాల్లో ఇస్తున్నాం. అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నాం. ఇంకేం చేయాలి అని బాధ్యత నుంచి పారిపోకుండా శాస్త్రీయంగా నిపుణులు సూచనలు, సలహాలతో రూపొందించిన వ్యాసాలను చదివి పిల్లల బంగారు భవిష్యత్తు నిర్మాణానికి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం.