ఫ్రాన్స్‌లో భారత రాయ‌బా‌రి ఎవరు?

విద్యార్థులూ, ఉద్యోగార్థులూ జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న ముఖ్యమైన సంఘటనలను గమనిస్తూ ఉండాలి. వాటిలోని ప్రధానాంశాలను గుర్తుంచుకోవాలి. కేంద్ర స్థాయిలో జరిగేవైనా, రాష్ట్ర స్థాయిలో జరిగేవైనా పోటీ పరీక్షల్లో వర్తమానాంశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ గుర్తుంచుకోవడం ఎంతో అవసరం!

జాతీ‌యం‌
1.‌ పౌర‌సత్వ సవ‌రణ చట్టం (సీఏఏ)కు వ్యతి‌రే‌కంగా దిల్లీ‌లోని షాహీ‌న్‌బా‌గ్‌లో సుమారు రెండు నెల‌లుగా జరు‌గు‌తున్న నిర‌స‌న‌లపై 2020 ఫిబ్రవరి 24న సుప్రీం‌కో‌ర్టుకు నివే‌దిక సమ‌ర్పిం‌చిన సీని‌యర్‌ న్యాయ‌వాది ఎవరు? (సీఏ‌ఏకు వ్యతి‌రే‌కంగా గత ఏడాది డిసెం‌బరు 15 నుంచి షాహీ‌న్‌బాగ్‌ వద్ద నిర‌స‌నలు కొన‌సా‌గు‌తున్న నేప‌థ్యంలో కొందరు సుప్రీం‌కో‌ర్టును ఆశ్రయిం‌చగా ఈయన నేతృ‌త్వంలో సుప్రీం‌కోర్టు మధ్య‌వ‌ర్తుల కమి‌టీని ఏర్పాటు చేసింది)
1) సంజ‌య్‌హెగ్డే 2) అనిల్‌ బారువా 3) జయంత్‌ పటే‌కర్‌ 4) హేమంత్‌ హెగ్డే
2.‌ ‌‘ఆసియా కీటక పర‌ప‌రాగ సంపర్క పరి‌రక్షణ సదస్సు’‌ను 2020 ఫిబ్రవరి 27 నుంచి 29 వరకు ఎక్కడ నిర్వ‌హిం‌చారు? (1992 నాటి జీవ వైవిధ్య ఒప్పందం జాతీయ, ప్రాంతీయ, అంత‌ర్జా‌తీయ స్థాయుల్లో పర‌ప‌రాగ సంపర్క కీట‌కాల సంరక్ష‌ణకు పరి‌శో‌ధ‌కులు ఉప‌క్రమిం‌చా‌లని వెల్ల‌డి‌స్తోంది.‌ ఈ నేప‌థ్యంలో సాటి ఆసియా దేశా‌ల్లోని పరి‌శో‌ధ‌కు‌లతో చేయి కల‌పా‌లని నిర్ణ‌యిం‌చిన భారత్‌ తాజాగా ఈ సద‌స్సును నిర్వ‌హిం‌చింది.‌ భారత జంతు శాస్త్ర సంఘం సహ‌కా‌రంతో కల‌కత్తా విశ్వ‌వి‌ద్యా‌లయం, బెంగ‌ళూరు వ్యవ‌సాయ విశ్వ‌వి‌ద్యా‌లయం, బెంగ‌ళూ‌రు‌లోని జాతీయ జీవ‌శాస్త్ర అధ్య‌యన కేంద్రాలు సంయు‌క్తంగా ఈ సద‌స్సును నిర్వ‌హిం‌చాయి)
1) దిల్లీ 2) బెంగ‌ళూరు 3) కోల్‌కతా 4) లఖ్‌నవూ
3.‌ ఫ్రాన్స్‌లో భారత రాయ‌బా‌రిగా ఇటీ‌వల ఎవరు నియ‌మి‌తు‌ల‌య్యారు? (ఈయన ఇప్ప‌టి‌వ‌రకూ సింగ‌పూ‌ర్‌లో భారత హైక‌మి‌ష‌న‌ర్‌గా పని‌చే‌శారు.‌ ఫ్రాన్స్‌లో రాయ‌బా‌రిగా ఉన్న వినయ్‌ మోహన్‌ క్వత్రా నేపాల్‌ రాయ‌బా‌రిగా నియ‌మి‌తు‌ల‌య్యారు)
1) ఖలీల్‌ అహ్మద్‌ 2) జావెద్‌ అష్రాఫ్‌ 3) మహ్మద్‌ అఖ్తర్‌ 4) అరుణ్‌ మిశ్రా
4.‌ క్రింది అంశాల్లో సరై‌నవి ఏవి?
ఎ) అమె‌రికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2020 ఫిబ్రవరి 24న రెండు రోజుల భారత పర్య‌టన కోసం ఎయి‌ర్‌ఫోర్స్‌ వన్‌ విమా‌నంలో అహ్మ‌దా‌బాద్‌ విమా‌నా‌శ్రయా‌నికి చేరు‌కు‌న్నారు.‌ ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్‌ బృందా‌నికి స్వయంగా స్వాగతం పలి‌కారు.‌ విమా‌నా‌శ్రయం నుంచి వీరు సబ‌ర్మతి ఆశ్రమా‌నికి వెళ్లారు.‌
బి) సబ‌ర్మతి ఆశ్రమం నుంచి రోడ్డు మార్గంలో ప్రయా‌ణిం‌చిన ట్రంప్, మోదీ ప్రపం‌చం‌లోనే అతి‌పెద్ద మోతెరా స్టేడి‌యంకు చేరు‌కుని ‌‘నమస్తే ట్రంప్‌’‌ కార్య‌క్రమంలో పాల్గొ‌న్నారు.‌ ప్రధాని మోదీ ఈ కార్య‌క్రమాన్ని ప్రారం‌భిం‌చారు.‌ అనం‌తరం ట్రంప్‌ 27 నిమి‌షాల పాటు ప్రసం‌గిం‌చారు.‌ అనం‌తరం భార్య మెల‌నియా, కుమారై ఇవాంకా, అల్లుడు కుష్న‌ర్‌తో కలసి డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రాలో తాజ్‌మ‌హ‌ల్‌ను సంద‌ర్శిం‌చారు.‌ ఆపై ట్రంప్‌ బృందం దిల్లీ చేరు‌కుంది.‌
సి) ఫిబ్రవరి 25న డొనాల్డ్‌ ట్రంప్‌ దంప‌తులు రాష్ట్రపతి భవన్‌ చేరు‌కోగా వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధి‌కా‌రిక స్వాగతం పలి‌కారు.‌ వీరు రాజ్‌ఘా‌ట్‌ను సంద‌ర్శించి జాతి‌పిత గాంధీకి ఘన నివా‌ళులు అర్పిం‌చారు.‌
డి) డొనాల్డ్‌ ట్రంప్‌ హైద‌రా‌బాద్‌ హౌస్‌లో ప్రధా‌నితో సమా‌వే‌శమై విస్తృత స్థాయి చర్చలు జరి‌పారు.‌ రెండు దేశాల మధ్య సుమారు రూ.‌21,500 కోట్ల విలు‌వైన రక్షణ ఒప్పందం ఖరా‌రైంది.‌ చమురు, ఆరోగ్య రంగాల్లో మూడు ఎంఓ‌యూలు కుది‌రాయి.‌ రాష్ట్రపతి భవ‌న్‌లో విందు చేసి ట్రంప్‌ బృందం అమె‌రి‌కాకు తిరుగు ప్రయా‌ణ‌మైంది.‌
1) ఎ, బి మాత్రమే 2) ఎ, బి, సి మాత్రమే 3) ఎ, సి మాత్రమే 4) పైవన్నీ
జవా‌బులు:‌ 1−‌1, 2−‌3, 3−‌2, 4−‌4

అంత‌ర్జా‌తీయం
1.‌ 2020 ఫిబ్రవరి 24న ఏ దేశ ప్రధా‌న‌మంత్రి అయిన మహ‌తిర్‌ మొహ‌మ్మద్‌ (94) తన పద‌వికి రాచ్కీజీజి‌నామా చేశారు?
1) ఇండో‌నే‌షియా 2) థాయ్‌లాండ్‌ 3) మలే‌షియా 4) ఫిలి‌ప్పీన్స్‌
2.‌ కరోనా వైరస్‌ (కొవిడ్‌−‌19) వ్యాప్తి కార‌ణంగా ఏ దేశంలో 2020 మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కావా‌ల్సిన వార్షిక పార్ల‌మెంటు సమా‌వే‌శాలు వాయి‌దా‌ప‌డ్డాయి? (దశా‌బ్దాల కాలంలో ఇలా సమా‌వే‌శాలు వాయిదా పడటం ఇదే తొలి‌సారి.‌ ఈ దేశ పార్ల‌మెంటు అయిన నేష‌నల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ −‌ ఎన్‌పీ‌సీ‌లోని స్టాండింగ్‌ కమిటీ సమా‌వే‌శా‌లను వాయిదా వేస్తూ నిర్ణయం తీసు‌కుంది)
1) జపాన్‌ 2) అమె‌రికా 3) చైనా 4) పాకి‌స్థాన్‌
3.‌ 2020 ఫిబ్రవరి 24, 25 ల్లో అమె‌రికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భార‌త్‌లో పర్య‌టిం‌చారు.‌ భార‌త్‌లో పర్య‌టిం‌చిన అమె‌రికా అధ్య‌క్షు‌లలో ఈయన 7వ వారు.‌ కాగా భార‌త్‌లో పర్య‌టిం‌చిన తొలి అమె‌రికా అధ్య‌క్షు‌డె‌వరు? (భార‌త్‌లో రెండు‌సార్లు పర్య‌టిం‌చిన ఏకైక అమె‌రికా అధ్య‌క్షు‌డిగా మాత్రం బరాక్‌ ఒబామా రికా‌ర్డుల కెక్కారు.‌ ఈయన 2010లో, 2015లో భార‌త్‌లో పర్య‌టిం‌చారు.‌ 2015 పర్య‌ట‌నలో భాగంగా ఒబామా భారత గణ‌తంత్ర వేడు‌క‌లకు ముఖ్య‌అ‌తి‌థిగా హాజ‌ర‌య్యారు.‌ 2010లో మన్మో‌హ‌న్‌సింగ్‌ హయాంలో జరి‌పిన పర్య‌ట‌నలో భారత పార్ల‌మెంటు సంయుక్త సమా‌వే‌శాన్ని ఉద్దే‌శించి ప్రసం‌గిం‌చారు)
1) రిచర్డ్‌ ఎం.‌ నిక్సన్‌ 2) డైవట్‌ ఐసె‌న్‌హో‌వర్‌ 3) జిమ్మి‌కా‌ర్టర్‌ 4) బిల్‌క్లిం‌టన్‌
4. కింది అంశాల్లో సరై‌నవి ఏవి?
ఎ) హురూన్‌ సంస్థ విడు‌దల చేసిన ‌‘గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2020’‌ 9వ ఎడి‌షన్‌ ప్రకారం ప్రపంచ ధన‌వం‌తుల్లో అమె‌జాన్‌ అధి‌పతి జెఫ్‌ బెజోస్‌ 140 బిలి‌యన్‌ డాల‌ర్లతో అగ్రస్థా‌నంలో నిలి‌చారు.‌
బి) రిల‌య‌న్‌ ఇండ‌స్ట్రీస్‌ అధి‌నేత ముఖేష్‌ అంబానీ 67 బిలి‌యన్‌ డాలర్ల నికర సంపద (సుమారు రూ.‌4.‌8 లక్షల కోట్లు)తో జాబి‌తాలో 9వ స్థానంలో నిలి‌చారు.‌
సి) 1 బిలి‌యన్‌ డాలర్లు (రూ.‌7,100 కోట్లు) అంత‌కంటే ఎక్కువ మొత్తం సంపద కలి‌గిన వారి జాబి‌తాను హురూన్‌ విడు‌దల చేసింది.‌ ఇందులో మొత్తం 2817 మంది ఉన్నారు.‌
డి) 799 మంది బిలి‌య‌నీ‌ర్లతో చైనా, 626 మంది బిలి‌య‌నీ‌ర్లతో అమె‌రికా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.‌ 138 మంది బిలి‌య‌నీ‌ర్లతో భారత్‌ జాబి‌తాలో మూడో స్థానంలో నిలి‌చింది.‌ భారత సంత‌తికి చెంది ఇతర దేశాల్లో ఉన్న‌వా‌రిని కూడా కలి‌పితే భారత బిలి‌య‌నీర్ల సంఖ్య 170గా ఉంటుం‌దని హురూన్‌ వెల్ల‌డిం‌చింది.‌
1) ఎ, బి మాత్రమే 2) ఎ,సి మాత్రమే 3) ఎ, బి, సి మాత్రమే 4) పైవన్నీ
5. మరియా షర‌పోవా ఇటీ‌వల టెన్ని‌స్‌కు వీడ్కోలు చెప్పింది.‌ ఈమె ఏ దేశా‌నికి చెందిన క్రీడా‌కా‌రిణి? (షర‌పోవా మొత్తం 5 గ్రాండ్‌ స్లామ్‌ టైటిళ్లు గెలి‌చింది.‌ మొత్తం నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలి‌చింది.‌ వీటిని నెగ్గిన అతి‌కొ‌ద్ది‌మంది ప్లేయ‌ర్లలో ఈమె ఒకరు.‌ షర‌పోవా 2004లో వింబు‌ల్డన్, 2006లో యూ.‌ఎస్‌.‌ ఓపెన్, 2008లో ఆస్త్రే‌లి‌యన్‌ ఓపెన్, 2012, 2014‌లలో ఫ్రెంచ్‌ ఓపె‌న్‌గ్రాం‌డ్‌స్లామ్‌ టైటి‌ళ్లను గెలు‌చు‌కుంది)
1) అమె‌రికా 2) జర్మనీ 3) ఆస్త్రే‌లియా 4) రష్యా
జవా‌బులు:‌ 1−‌3, 2−‌3, 3−‌2, 4−‌4, 5−‌4

ఇత‌రాలు
1.‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య‌మంత్రి వై.‌ఎస్‌.‌ జగ‌న్‌మో‌హ‌న్‌రెడ్డి జగ‌నన్న వసతి దీవెన పథ‌కాన్ని 2020 ఫిబ్రవరి 24న ఎక్కడ ప్రారం‌భిం‌చారు? (ఏడా‌దికి రెండు‌న్నర లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న ప్రతి పేద కుటుం‌బా‌నికి చెందిన డిగ్రీ, పీచ్కీజీజి చదివే విద్యా‌ర్థు‌లకు రూ.‌20 వేలు, ఐటీఐ విద్యా‌ర్థు‌లకు రూ.‌10 వేలు, పాలి‌టె‌క్నిక్‌ విద్యా‌ర్థు‌లకు రూ.‌15 వేల చొప్పున ఈ పథకం కింద వసతి, భోజన ఖర్చులు అంది‌స్తారు.‌ ఈ మొత్తాన్ని రెండు విడ‌త‌లుగా విద్యా‌ర్థుల తల్లు‌లకు అంద‌జే‌స్తారు.‌ ఈ కార్య‌క్రమా‌నికి ఏటా రూ.‌2,300 కోట్లు కేటా‌యి‌స్తు‌న్నట్లు సీఎం జగన్‌ పేర్కొ‌న్నారు)
1) విజ‌య‌న‌గరం 2) విశా‌ఖ‌పట్నం 3) అనం‌త‌పురం 4) రాజ‌మ‌హేం‌ద్రవరం
2.‌ కింది అంశాల్లో సరై‌నవి ఏవి?
ఎ) ఆంధ్రప్రదే‌శ్‌కు చెందిన ప్రముఖ రచ‌యిత్రి పోచి‌రాజు సత్య‌వ‌తికి అను‌వాద విభా‌గంలో 2019‌కి‌గానూ కేంద్ర సాహిత్య అకా‌డమీ పుర‌స్కారం లభిం‌చింది.‌
బి) 2013 జన‌వరి నుంచి 2017 డిసెం‌బరు వరకు అను‌వాదం చేసిన పుస్త‌కాల్లో వివిధ భాష‌లకు చెందిన 23‌మంది రచ‌యి‌త‌లకు కేంద్ర సాహిత్య అకా‌డమీ 2014‌కి‌గానూ ఈ పుర‌స్కారం ప్రక‌టిం‌చింది.‌
సి) ఎ.‌ రేవతి రచిం‌చిన ‌‘‌‘ద ట్రూత్‌ అబౌట్‌ మీ:‌ ఏ హిజ్రా లైఫ్‌ స్టోరీ’‌ని సత్య‌వతి ‌‘‌‘ఓ హిజ్రా ఆత్మ‌కధ’‌గా తెలు‌గు‌లోకి అను‌వ‌దిం‌చారు.‌ దీనికే ఈ పుర‌స్కారం లభిం‌చింది.‌ పుర‌స్కార విజే‌త‌లకు రూ.‌ 50 వేల నగదు, తామ్ర పత్రం అంది‌స్తారు.‌
డి) 1940లో సత్య‌వతి గుంటూరు జిల్లాలో జన్మిం‌చారు.‌ ఈమె రాసిన ‌‘వాటీజ్‌ మై నేమ్‌’‌ కథ పదో తర‌గ‌తిలో పాఠ్యాం‌శంగా, ‌‘విల్‌ హీ కమ్‌ హోమ్‌’‌ కథ ఇంట‌ర్‌లో పాఠ్యాం‌శంగా ఉన్నాయి.‌ ఈమె 200కు పైగా కథలు, అనేక నవ‌లలు రచిం‌చారు.‌
1) ఎ మాత్రమే బి) ఎ, బి మాత్రమే సి) ఎ, బి, సి మాత్రమే డి) పైవన్నీ
3.‌ రంగ‌స్థల, సినిమా నటు‌డిగా, రచ‌యి‌తగా, పత్రికా సంపా‌ద‌కు‌డిగా బహు‌ముఖ ప్రజ్ఞ కన‌బ‌ర్చిన ఏ ప్రము‌ఖుడి సేవ‌లకు గుర్తిం‌పుగా భారత ప్రభుత్వ తపా‌లా‌శాఖ, తెలం‌గాణ సర్కిల్‌ 2020 ఫిబ్రవరి 25న ప్రత్యే‌క‌మైన కవ‌ర్‌ను విడు‌దల చేసింది?
1) కైకాల సత్య‌నా‌రా‌యణ 2) రావి కొండ‌ల‌రావు 3) రావు గోపా‌ల‌రావు 4) పై ముగ్గురూ
4.‌ ‌‘ఆల్‌ ఎబి‌లిటీ చిల్డ్రన్‌ పార్క్‌’‌ పేరుతో స్మార్ట్‌ సిటీ మిషన్‌ కింద దేశం‌లోనే తొలి‌సా‌రిగా దివ్యాంగ చిన్నా‌రుల కోసం రూ.‌ 3 కోట్ల వ్యయంతో బాలల పార్కును ఏ నగ‌రంలో ఏర్పాటు చేశారు?
1) హైద‌రా‌బాద్‌ 2) బెంగ‌ళూరు 3) విశా‌ఖ‌పట్నం 4) అహ్మ‌దా‌బాద్‌
5.‌ ఏ దేశ మాజీ అధ్య‌క్షుడు హోస్నీ ముబా‌రక్‌ 2020 ఫిబ్రవరి 25న మర‌ణిం‌చారు? (ఈయన అమె‌రి‌కాకు అత్యంత సన్ని‌హి‌తు‌డిగా మెలి‌గారు.‌ 2011లో ఈ దేశం‌లోని యువత సుమారు 18 రోజు‌ల‌పాటు దేశ రాజ‌ధా‌ని‌లోని సెంట్రల్‌ తహ్రీర్‌ స్కేర్‌లో జరి‌పిన ఆందో‌ళ‌నల కార‌ణంగా మిల‌టరీ వర్గాలు హోస్నీ ముబా‌ర‌క్‌తో బల‌వం‌తంగా రాచ్కీజీజి‌నామా చేయిం‌చాయి.‌ ఈ దేశ చరి‌త్రలోనే మొద‌టి‌సారి ఒక అధ్య‌క్షు‌డిని పద‌వీ‌చ్యు‌తు‌డిని చేయ‌డమే కాకుండా జైల్లో పెట్ట‌డమూ ముబా‌రక్‌ విష‌యం‌లోనే జరి‌గింది.‌ ఈ ఘట‌నకు ముందు సుమారు 30 ఏళ్ల‌పాటు ఈయన పరి‌పా‌లనా కాలాన్ని మధ్య ప్రాచ్యంలో శాంతి, సుస్థి‌ర‌త‌లకు ప్రతీ‌కగా పేర్కొ‌నే‌వారు).‌
1) ఈజిప్ట్‌ 2) ఇరాక్‌ 3) జోర్డాన్‌ 4) పాల‌స్తీనా
జవా‌బులు:‌ 1−‌1, 2−‌4, 3−‌2, 4−‌3, 5−‌1
Back..

Posted on 02-03-2020