ప్రవేశాలకు పోటీ ఎక్కువుంటుందా?

విదేశాల్లో ఉన్నతవిద్యకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఎన్నో సందేహాలుంటాయి. కొన్ని సందర్భాల్లో తదుపరి ప్రక్రియకు వెళ్లకుండా మధ్యలోనే వెనకడుగు వేసిన సంఘటనల గురించి వింటుంటాం. కానీ ఇలాంటివి సమాచారలోపం, అపోహల వల్లనే జరుగుతుంటాయి.

ప్ర: విద్యార్థులకు చదువు పూర్త్తెన తరువాత పోస్ట్‌స్టడీ వీసాను ఉపయోగించుకునే వీలుందా?
:వీలుంది. దేశాన్ని బట్టి పోస్ట్‌స్టడీ వీసా గడువు మారుతుంది. ఎంచుకున్న కోర్సును బట్టి కూడా మారుతుంది.

కెనడా పోస్ట్‌స్టడీ వీసా పరిమితి కోర్సు వ్యవధితో సమానంగా ఉంటుంది. మాస్టర్స్‌ డిగ్రీ చేయాలనుకునేవారికి కోర్సు పూర్త్తెన తరువాత వీసాపై మూడేళ్లు గడువు పొడిగింపు లభిస్తుంది.
ఆస్ట్రేలియాలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్త్తెన తర్వాత రెండేళ్ల గడువుతో పోస్ట్‌స్టడీ వీసా ఇస్తారు. మాస్టర్స్‌తో రీసెర్చ్‌ చేసేవారికి మూడేళ్ల వీసా ఇస్తారు.
అమెరికాలో కోర్సు, ప్రొఫైల్‌ని బట్టి విద్యార్థులకు మూడు నుంచి ఐదేళ్ల వరకు వీసా లభిస్తుంది.
యూకేలో 12 నెలల కాలపరిమితి ఉన్న ప్రోగ్రామ్‌కు 16నెలల పోస్ట్‌స్టడీ వీసా ఇస్తారు.

ప్ర: విదేశాల్లో చదువుతున్నపుడు లా/ బిజినెస్‌ లాంటి స్వల్పకాలిక కోర్సులు చేయవచ్చా?
జ: అలా వీలుండదు. కేవలం దరఖాస్తు చేసుకున్న కోర్సులను మాత్రమే చదవడానికి అవకాశముంటుంది. విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నపుడు వేరే స్వల్పకాలిక కోర్సులు చేయడానికి అనుమతించరు.

ప్ర:విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లడానికి మెడికల్‌ ఇన్స్యూరెన్సు తప్పనిసరిగా చేయించుకోవాలా?
జ: అవును. వీసా వచ్చిన ప్రతి విద్యార్థికీ ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ అండ్‌ మెడికల్‌ ఇన్స్యూరెన్స్‌ అవసరం. విద్యార్థులు విశ్వవిద్యాలయాలు అందించే బీమా సౌకర్యంతోపాటు ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ ఇన్స్యూరెన్స్‌ కూడా చేయించుకోవాలి.

ప్ర: ఇతర విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు పొందేందుకు పోటీ ఎలా ఉంటుంది?
జ: ఎంచుకున్న ప్రోగ్రామ్‌, విశ్వవిద్యాలయాలను బట్టి ఉంటుంది. కొన్ని కోర్సుల్లో వీలైనంత ఎక్కువమందిని చేర్చుకునే సౌలభ్యం ఉంటుంది. కొన్నింటిలో మాత్రం ఉండదు. అన్ని ప్రోగ్రామ్‌లకూ తగిన విద్యార్హతలుండాలి.

ప్ర: ఖర్చు ఎంతవుతుంది?
జ: ప్రోగ్రామ్‌ని బట్టి వ్యయంలో మార్పులుంటాయి. ప్రోగ్రామ్‌ ఫీజు, ఆ దేశంలో జీవనవ్యయం, కరెన్సీ మారకం వంటి అంశాల్ని బట్టి ఖర్చు మారుతుంది.

ప్ర: విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు ఉపకారవేతనాలేవైనా అందుబాటులో ఉన్నాయా?
జ: ఉన్నాయి. అంతర్జాతీయ విద్యార్థులకు వివిధ రకాల ఉపకారవేతనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని మంచి అకడమిక్‌ ప్రొఫైల్‌, అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మంజూరు చేస్తారు.

ప్ర: విదేశాల్లో ఎంతకాలం వరకు చదువుకోవచ్చు?
జ: కోర్సు కాలవ్యవధిని బట్టి ఉంటుంది. సాధారణంగా ఏ కోర్సైనా ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఉంటుంది.

ప్ర: విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లేటప్పుడు ఎన్ని రకాలైన టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది?
జ: మీరు వెళ్తున్న ప్రదేశం, చదవబోయే విశ్వవిద్యాలయాన్ని బట్టి వ్యాక్సినేషన్‌ తీసుకోవాలి.Ask the Expert
Click Here..