అమెరికాలో ఎంబీఏ ఎలా?

ప్రపంచవ్యాప్తంగా ఎంబీఏ చేయాలనుకునే విద్యార్థుల్లో చాలామంది యునైటెడ్‌ స్టేట్స్‌లోని బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశం కోసం దరఖాస్తు చేస్తుంటారు. అక్కడ ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండే అక్రిడిటెడ్‌ విశ్వవిద్యాలయాలున్నాయి.

అమెరికాలో ఎంబీఏ డిగ్రీ పూర్తి చేయడానికి సుమారు 18 నుంచి 30 నెలల సమయం పడుతుంది. ట్యూషన్‌ ఫీజు విశ్వవిద్యాలయం, సాధించిన క్రెడిట్లపై ఆధారడి ఉంటుంది. కోర్సు పూర్తిచేయడానికి సుమారు రూ. 18 లక్షల నుంచి 60 లక్షలు ఖర్చవుతుంది.

ఏయే స్పెషలైజేషన్లు?

ఎంబీఏ విద్యార్థులకు అమెరికాలోని మేనేజ్‌మెంట్‌ కళాశాలలు విస్తృతశ్రేణి స్పెషలైజేషన్లు అందిస్తున్నాయి. వాటిలో కొన్ని:

* మార్కెటింగ్‌
* ఫైనాన్స్‌
* ఐటీ, సిస్టమ్స్‌
*హ్యూమన్‌ రిసోర్సెస్‌
* హెల్త్‌కేర్‌ అడ్మినిస్ట్రేషన్‌
* ఇంటర్నేషనల్‌ బిజినెస్‌
* మార్కెటింగ్‌, ఆపరేషన్స్‌
* ఇన్‌స్యూరెన్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌
* హాస్పిటాలిటీ, టూరిజం
* ఆంత్రప్రెన్యూరియల్‌ మేనేజ్‌మెంట్‌

ప్రవేశం పొందడానికి ...

* గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ కళాశాల నుంచి మంచి మార్కుల శాతంతో కూడిన అండర్‌గ్రాడ్యుయేట్‌ డిగ్రీ
* GRE/ GMAT స్కోర్లు (జీమ్యాట్‌ వాంఛనీయం)
* IELTS/ TOEFL స్కోర్లు
* ఉంటే... వృత్తి అనుభవం

మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) తప్పనిసరేమీ కాదు. చాలా కొద్ది విశ్వవిద్యాలయాలు ప్రవేశాలకు ముందు ఇంటర్వ్యూ నిర్వహిస్తాయి.

GRE/ GMAT స్కోర్లు లేకపోయినా కొన్ని విశ్వవిద్యాలయాలు ప్రవేశం అందిస్తున్నాయి. కానీ వీసా పొందడానికి మాత్రం ఈ స్కోరు ఉండడం మంచిది. మనదేశంలో 15 సంవత్సరాలు చదివినవారు అమెరికాలో ఎంబీఏ చేయాలనుకుంటే వారికి ప్రవేశం కల్పిస్తున్న కొన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. సాధారణంగా విద్యార్థులు స్టడీ వీసా (F-1) 3- 5 సంవత్సరాల వ్యవధి ఉన్నవి పొందుతారు.

మిగతా కోర్సుల విద్యార్థుల్లానే ఎంబీఏ విద్యార్థులు కూడా నిర్దిష్ట సమయం పనిచేసి డబ్బు సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకించి ఎంబీఏ విద్యార్థులు డబ్బు సంపాదించుకోవడానికి CPT, OPT ఆప్షన్లను విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయిAsk the Expert
Click Here..