భాషా నైపుణ్యాలకు IELTS మెరుగులు

ఐరోపాలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందాలంటే లాంగ్వేజ్‌ టెస్టులు కీలక భూమిక పోషిస్తున్నాయి. విద్య, వలస (ఇమిగ్రేషన్‌)లకు సంబంధించి ప్రాచుర్యం పొందిన IELTS లో మెరుగైన ప్రతిభ చూపాలంటే ఏం చేయాలో పరిశీలిద్దాం! ఆంగ్లం మాతృభాషగా ఉన్న దేశాల్లో విద్య, ఉద్యోగాలూ, నివాసం కోసం వెళ్ళేవారి భాషా సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు రూపొందిన పరీక్ష IELTS (ఇంటర్నేషనల్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టమ్‌). ఈ భాషలో విస్తృతంగా చదవటం, వినటం ముఖ్యం. దీనివల్ల పెంపొందే నైపుణ్యాలు ఈ పరీక్షలో మంచి స్కోరుకు దోహదపడతాయి. అంతేకానీ ముందే సిద్ధం చేసిన వ్యాసాలను బట్టీ పట్టి ఫలితం సాధించాలంటే వికటించే ప్రమాదముంది.

రైటింగ్‌ విభాగంలో ఏం రాయాలన్నది ముందు ఒక ప్రణాళిక వేసుకుని దాన్ని పాటించాలి. ఈ పరీక్షలో అక్షరక్రమం (spelling) ముఖ్యమైన అంశం. అలాగే ఉపయోగించే భాషలో అబ్రివియేషన్స్‌, slang కూడదు. informal language ఉపయోగించరాదు. నెగిటివ్‌ మార్కులు లేవు కాబట్టి ఖాళీగా వదిలిపెట్టటం సరికాదు. సరైన జవాబు గుర్తించటానికి ప్రయత్నించాలి.
లిసనింగ్‌ అండ్‌ రీడింగ్‌
¤ జాగ్రత్తగా చదివి, కీలకపదాలను అండర్‌లైన్‌ చేసుకోవాలి. తర్వాత జవాబులు గుర్తించాలి.
¤ వినేటపుడు ప్రశ్నపత్రంపై జవాబులను నోట్‌ చేసుకోవాలి.
రైటింగ్‌
¤ ప్రశ్నల్లోని కీలకపదాలను సర్కిల్‌/ హైలైట్‌ చేయాలి.
¤ టాపిక్‌ నుంచి వేరే అంశానికి మళ్ళకూడదు.
¤ ఒక పేరాగ్రాఫ్‌లో ఒకే ఆలోచనాధార ఉండాలి.
¤ అక్షరదోషాలు, విరామచిహ్నాలు, వ్యాకరణం సరిచూసుకోవడానికి సమయం మిగుల్చుకోవాలి.
స్పీకింగ్‌
ఎగ్జామినర్‌ సూచనలూ, ప్రశ్నలను జాగ్రత్తగా వినాలి.
¤ ప్రశ్నలకు పూర్తి సమాధానాలు ఇవ్వాలి.
అభ్యర్థులు తరచూ చేస్తున్న పొరపాట్లు
¤ ఇంగ్లిష్‌ నైపుణ్యాలు పెంచుకోవటం మీద కాకుండా టెస్ట్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టటం. ఇది సరికాదు. టెస్టులోని అంశాలకే పరిమితం కాకుండా ఇంగ్లిష్‌ భాషను మెరుగుపరుచుకోవటానికి విస్తృతంగా కృషి చేయాలి.
¤ సమయ నిర్వహణలో వైఫల్యం. ముఖ్యంగా రీడింగ్‌ విభాగంలో ఈ సమస్య ఎక్కువమందికి వస్తోంది. విషయాన్ని స్థూలంగా అవగాహన చేసుకోవటం, నిర్దిష్ట సమాచారాన్ని గుర్తించటం ముఖ్యం. ఇచ్చిన వ్యవధిలోపే సమాధానాలను జవాబుపత్రంపై గుర్తించటం కూడా ప్రధానమే.
¤ స్పీకింగ్‌, రైటింగ్‌లలో ప్రశ్నలకు సంపూర్ణంగా జవాబులు గుర్తించకపోవటం. ప్రశ్నలోని ప్రతి భాగాన్నీ, అంశాన్నీ జాగ్రత్తగా విని జవాబుకు ప్రయత్నించాలి. పాక్షికంగా జవాబు రాస్తే మార్కుల్లో కోత పడుతుందని గుర్తించాలి.

Ask the Expert
Click Here..