వెళ్తున్నారా వీసా ఇంటర్వ్యూకి?

విదేశంలో నివసించేటపుడూ, చదువు పూర్తయ్యాకా తన ప్రణాళికలేమిటో కాన్సలర్‌ అధికారికి విద్యార్థి వివరించే సదవకాశం.. వీసా ఇంటర్వ్యూ. ఎల్లలు దాటి విద్యను అభ్యసించే ప్రక్రియలో ముఖ్యమైన ఈ ఘట్టంలో విజయవంతం కావటానికి ఏ మెలకువలు పాటించాలో చూద్దాం!

ఏమౌఖిక పరీక్షలోనైనా నిజాయతీ, ఆత్మవిశ్వాసం అనుకూల ఫలితాలను అందిస్తాయి. చెప్పే విషయంలో స్పష్టత, సూటిదనం అవసరం. అది ఉన్నపుడు తడబాటు ఉండదు. ఇందుకు విద్యార్థి ముందస్తుగా సన్నద్ధమవ్వాలి. అంతేకాకుండా వివిధ అంశాలపై రుజువులను కూడా చూపగలిగేలా ఉండాలి.

విశ్వవిద్యాలయ అంగీకారానికి సంబంధించి.. ప్రశ్నలు కింది విధంగా ఉంటాయి.
* How many colleges did you apply to?
* How many schools did you get admitted to?
* How many schools rejected you?
* Have you been to the US before?
* Do you know your professors at that university? What are their names?
* What city is your school located in?
* Why are you going to this University?

ఏ అకడమిక్‌ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకున్నారో.. వాటిపైనా ప్రశ్నలకు అవకాశం ఉంటుంది.
* Why are you going to the US?
* What will you specialize in for your degree?
* What will be your major?
* Where did you go to school now?
* Who is your current employer? What do you do?
* Why are you planning to continue your education?
* Can you not continue your education in your home country?
* How will this study program relate to your past work or studies?

విద్యాపరమైన సామర్థ్యాన్ని పరీక్షించే ప్రశ్నలను కూడా అడిగే అవకాశం ఉంది.
* What are your test scores (GRE, GMAT, SAT, TOEFL, IELTS)?
* What was your previous GPA?
* How will you manage the cultural and educational differences in the US?
* How good is your English?
* Why do you want to pursue a degree in the US?
* Why not study in Canada, Australia or the UK?
* What do you know about US schools?
* Can I see your high school/college diploma?

విద్యను అభ్యసించడానికి, నివాసానికి అయ్యే ఖర్చులను భరించే ఆర్థిక స్థోమత (ఫారం ఐ-20లో చూపిన మొత్తం) ఉందేమో పరీక్షిస్తారు.
* What is your monthly income?
* What is your sponsor's annual income?
* How do you plan to fund the entire duration of your education?
* How much does your school cost?
* How will you meet these expenses?
* Who is going to sponsor your education?
* What is your sponsor's occupation?
* How else will you cover the rest of your costs?
* Do you have a copy of your bank statements?
* Did you get offered a scholarship at your school?
* Can I see your tax returns?

విదేశంలో పూర్తిచేసిన చదువును తిరిగి వచ్చాక ఎలా ఉపయోగించదలచుకున్నారో ఇంటర్వ్యూ చేసేవారు తెలుసుకోవాలనుకోవచ్చు. గ్రాడ్యుయేషన్‌ తర్వాతి ప్రణాళికలపైనా ప్రశ్నలు ఉండొచ్చు.
* Do you have relatives or friends currently in the US?
* What are your plans post-graduation?
* Do you have a job or career in mind after you graduate?
* Do you plan on returning back to your home country?
* What are your plans after graduation?
* Are you sure you won't stay in the US?
* Will you continue to work for your current employer after you graduate?

ప్రశ్న... జవాబు తరహా వద్దు
పైన చెప్పిన మాదిరి ప్రశ్నలకు సిద్ధమవ్వండి. కానీ, ప్రశ్న-జవాబు తరహాలో సన్నద్ధమవొద్దు. ఎందుకంటే ఇది పరీక్ష కాదు కదా! ఇంటర్వ్యూ అధికారులు మీ గురించీ, విద్య, విజయాలు, భవిష్యత్‌ లక్ష్యాలు, స్వదేశంతో ఆత్మీయానుబంధం వంటివి అడుగుతారు. కాబట్టి, మీరు చెప్పాలనుకున్న అంశాలకు సిద్ధమవండి.
సాధారణంగా వీసా ఇంటర్వ్యూ వ్యవధి 60 సెకన్ల నుంచి 15 నిమిషాల మధ్య ఉంటుంది. మీరు వరుసక్రమంలో నిల్చున్నప్పటి నుంచే వాళ్లు మిమ్మల్ని గమనిస్తూ ఉండొచ్చు. అంటే, వరుసలో నిల్చున్నప్పుడు మీ ప్రవర్తన, వైఖరి, వ్యక్తిత్వం లాంటి అంశాలను అంచనా వేసే అవకాశమూ ఉంది.

తొలి ప్రభావమే కీలకం
ఇక్కడ మొదటి ప్రభావమే చివరిదయ్యే అవకాశముంది. విద్యార్థి భావప్రకటన నైపుణ్యాలు, ధీమా, ఉత్సుకత, చదవబోయే కోర్సుపై వైఖరి మొదలైన అంశాల ఆధారంగా ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. మంచి సౌకర్యవంతమైన దుస్తులు ధరించటం, భయాందోళనలకు లోనవకుండా ఉండటం ముఖ్యం. వీసా అధికారి (VO) ని చిరునవ్వుతో మర్యాదగా పలకరించటం మరచిపోకూడదు.

ఈ విశ్వవిద్యాలయమే ఎందుకు?
వీసా ఆఫీసర్‌ దాదాపుగా అందరినీ అడిగే సాధారణమైన ప్రశ్న ఇదే అయ్యుండొచ్చు. కాబట్టి విద్యార్థి తాను చదవబోయే విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రతీ అంశాన్నీ తెలుసుకుని ఉండాలి. ఆ విశ్వవిద్యాలయాన్నే ఎందుకు ఎంచుకున్నారో.. ప్రభావితం చేసిన అంశాల గురించి వీసా అధికారిని మెప్పించేలా చెప్పాలి. భవిష్యత్‌ లక్ష్యాలను చేరుకోవడానికి కోర్సులోని పాఠ్యాంశాలు, బోధన సిబ్బంది వంటి అంశాలు ఎలా ఉపయోగపడతాయో వివరించగలగాలి.
వీసా అధికారి మీ విద్యార్హతల గురించి నిర్ణీత ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది.
* మీ విద్యార్హతలు, ఏ అంశంలో ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు?
* జీఆర్‌ఈ, శాట్‌, జీమ్యాట్‌, టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్లు
* ఆ అంశంలోనే మాస్టర్స్‌/ బ్యాచిలర్స్‌ డిగ్రీ ఎందుకు చేయాలనుకుంటున్నారు?
విద్యార్హతలకు సంబంధించిన అన్ని మార్కుల సర్టిఫికెట్లు, పరీక్ష ఫలితాల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు మీ వెంటే ఉండేలా ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. జీపీఏ లేదా ఇతర పరీక్షల మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయో, బ్యాక్‌లాగ్స్‌, ఇయర్‌ డ్రాప్స్‌ ఎందుకు ఉన్నాయో వీసా అధికారికి నిజాయతీగా వివరించాలి. చిన్నచిన్న లోపాలున్నా అంకితభావం, కఠోరదీక్షతో డిగ్రీ ఎలా పూర్తిచేయాలనుకుంటున్నారో విశ్వాసం కలిగించాలి. ఒకవేళ మీ స్పెషలైజేషన్‌ మార్చుకోదలచుకుంటే అందుకు సరైన కారణాన్ని చెప్పగలగాలి. ఎందుకు మారాలనుకుంటున్నారో సర్దిచెప్పగలగాలి.

డిగ్రీ తర్వాత?
కేవలం చదువు కోసమే విదేశం వెళ్తున్నానీ, డిగ్రీ పూర్తవ్వగానే మళ్లీ స్వదేశానికి తిరిగి వస్తానని వీసా అధికారికి నమ్మకం కలిగేలా వివరించగలగాలి. ఇక్కడ కాస్త తడబాటుకు గురైనా, నమ్మకం కలిగించేలా సమాధానం లేకపోయినా వీసా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే విదేశీ డిగ్రీ పూర్తిచేసుకుని స్వదేశానికి తిరిగివచ్చాక ఏ సంస్థలో పని చేయాలనుకుంటున్నారో చెప్పండి.వ్యక్తిగత బలాలు, భవిష్యత్‌ పరిశోధన లక్ష్యాలను వివరించాలి.

నమూనా ముఖాముఖి
VO: Hello, Good morning!
Studebt: Hello Sir! Good morning!
* Please pass me your Passport and I-20.
* Sure Sir! (Gave it to him)
* Why US?
* To pursue MS in Computer Science in The University of Texas at Dallas.
* Why UTD?
* UTD has good research in Computer Science. Especially the research in Cloud and Cyber Security area. UTD offers a unique curriculum on it. There is Information Assurance track for it. And the professors' (better tell names of prof.) recent research in this area is recognized very well. I want to research under their guidance.
* Oh! Cloud n Cyber Security. Good!.
When did you pass out your bachelors'.
* 2014
* What were you doing since then?
* I have worked at Infosys till this may.
* Then why are you leaving job and going for studies again?
* Sir! at Infosys I was working as a support engineer which doesn't have much scope in the area of product development where my interest is. For this I want to have expanded knowledge. MS degree gives me practical knowledge on latest research. (Don't remember what I said exactly. Something related to above)
* OK. Who is sponsoring your education?
* My parents. And I have SBI education loan.
* What do they do?
* My father is a teacher in Govt. High School teacher and mother owns saree business.
* So which state you are from?
* Andhra Pradesh
* Pass me your bank passbooks and loan sanction letter.
* (Gave it to him)
(There are three passbooks. Two belong to my father and one is my mom's. Better take passbooks that have transactions of past 6-9 months)
* (VO asked to explain some transactions in my parents' passbooks)
* (Explained)
Suggestion: Know the sources of your funds very well.
* Ok! So you have 20lacks bank loan and around xx lacks savings, so according to I-20, this amount will be enough for one year. How will you manager second year?
* We have our own house of worth xx lacks and a building that we leased to a school of worth xx lacks and my parents have annual income of 11 lacks. We will use these sources if we need money.
* Ok. I'm approving your VISA.
* Thank you sir :)

ఆర్థిక సంబంధ వివరాలు
అమెరికాలో డిగ్రీ పూర్తయ్యేంతవరకు సరిపోయేంత డబ్బులు ఉన్నాయని మీ ఆర్థిక పత్రాలు, ప్రాయోజకకర్త వివరాలతో వీసా అధికారికి నమ్మకం కలగాలి. మీకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నవారి వివరాలు, ఎందుకు చేస్తున్నారో సవివరంగా తెలపాలి. ప్రాయోజకకర్త వార్షికాదాయం, ఒకవేళ అప్పులుంటే, వాటి వివరాలు పేర్కొనాలి. మీరు చెప్పిన వివరాలన్నింటినీ సాధికారికంగా బలపరిచే ఆర్థిక పత్రాలను సమర్పించాలి.
ఇక వీసా అధికారి అడిగే ఇతర ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పడానికి సంసిద్ధంగా ఉండాలి. ఎందుకు విదేశంలో చదవాలనుకుంటున్నారు? యూనివర్సిటీ ఏ ప్రాంతంలో ఉంది? గతంలో సాధించిన విజయాలు, విదేశీ ప్రయాణాలు (ప్రత్యేకంగా అమెరికా), ఉద్యోగానుభవం, పనిచేసిన సంస్థ, సంస్థలు మీరందించిన సేవలు, ఎందుకు ఆ ఉద్యోగం విడిచిపెట్టి అక్కడ డిగ్రీ చేయాలనుకుంటున్నారు?... ఇవన్నీ.

అభ్యాసమే ప్రధానం
ఎక్కువగా అభ్యాసం చేయడమే వీసా ముఖాముఖిలో విజయ సాధనకు దోహదం చేస్తుంది. బంధుమిత్రులు, నిపుణులు చేసే నమూనా ముఖాముఖిల్లో ఎక్కువగా పాల్గొనాలి. ఎక్కడ తడబాటుకు గురవుతున్నారో ఎక్కడ లోపాలున్నాయో గుర్తించి, ఆ అంశాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టి మెరుగుపరచుకోవాలి. చివరగా 'Your visa has been approved' అనే మాట వినేంతవరకూ ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం, ఆశాజనకంగా ఉండాలి.
గమనిక: కాన్సలర్‌ ఆఫీసర్‌తో వాదన చేయకూడదు. ఒకవేళ వీసా రద్దు అయితే, దాన్ని అధిగమించడానికి అవసరమైన ఇతర ముఖ్య పత్రాల గురించి అడిగి తెలసుకోండి. వీసా తిరస్కరణ కారణాలను రాతపూర్వకంగా ఇవ్వవలసిందిగా కోరండి.

Posted on 29.05.2017


Ask the Expert
Click Here..